Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

దాదా రికార్డు బద్దలు: కోహ్లీ 23వ సెంచరీ ప్రత్యేకత ఇదే

Posted by:
Published: Saturday, October 24, 2015, 11:12 [IST]

ముంబై: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 23 సెంచరీలు నమోదు చేసిన వయసులోనే, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే వయసులో 23వ సెంచరీ నమోదు చేయడం విశేషం. వన్డేల్లో 23వ సెంచరీ నమోదు చేసే నాటికి సచిన్ వయసు 27 ఏళ్లు.

అక్టోబర్ 22న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ 165 వన్డేలు ఆడిన విరాట్‌కు ఇది కెరీర్‌లో 23వ సెంచరీ కావడం విశేషం. ఇప్పుడు కోహ్లీ వయసు కూడా 27 సంవత్సరాలు కావడం విశేషం.

ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ పలు రికార్డులను సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో టెస్ట్‌ హోదా కలిగిన అన్ని జట్లపై సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గానూ కొహ్లీ రికార్డులకెక్కాడు. సచిన్‌ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కొహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

Virat Kohli Does a Sachin Tendulkar With 23rd ODI Ton

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్ధానంలో నిలిచిన విరాట్ కోహ్లీ, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకూ 22 సెంచరీలతో ఇప్పటివరకూ సౌరభ్ గంగూలీతో కలిసి రెండో స్థానాన్ని పంచుకున్న విరాట్ కొహ్లీ దాదాను వెనక్కునెట్టాడు.

ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో మొదటి స్ధానంలో ఉన్నాడు. రాబోయే కాలంలో సచిన్ టెండూల్కర్ రికార్డులను విరాట్ కోహ్లీ బద్దలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు క్రీడా విశ్లేషకులు.

English summary
Virat Kohli, undoubtedly India's most consistent and fiery batsman in the past couple of years, scored his 23rd century in the fourth ODI versus South Africa in Chennai on Thursday. His milestone came after 13 innings without a ODI century.
మీ వ్యాఖ్య రాయండి