Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

చెన్నై సూపర్ కింగ్స్‌ను వీడి కొత్త జట్టుకు ధోనీ?

Posted by:
Published: Sunday, October 25, 2015, 14:26 [IST]

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చర్రితలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ పేరు తెచ్చుకుంది. అందుకు దాని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనియే కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులతో చెన్నై జట్టు రెండేళ్ల నిషేధం ఎదుర్కొంటోంది.

ఈ రెండేళ్లు ధోనీ కూడా లీగ్‌కు దూరమైనట్టేనా? అంటే కాదనే వార్తలు వస్తున్నాయి. కొత్తగా చేరనున్న రెండు జట్లలో ఒకదానికి ధోనీ ప్రాతినిథ్యం వహించవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లీగ్ ఆరంభం నుంచి పసుపు జెర్సీలో కనిపించిన ధోనీ వచ్చే ఏడాది నుంచి వేరే జెర్సీలో దర్శనం ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

 After CSK suspension, Mahendra Singh Dhoni looking to switch side: Report

శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ యజమాని శ్రీనివాసన్‌ను ధోనీ కలిసింది కూడా ఈ అంశంపై చర్చించేందుకేనని అంటున్నారు. అయితే ధోనీ చెన్నైని పూర్తిగా వీడతాడని మేం చెప్పబోమని, ఈ రెండేళ్లపాటైతే కొత్త జట్టుతో ధోనీ ఆడతాడని అంటున్నారు.

ఒక్క ధోనీయే కాదు నిషేధం ఎదుర్కొంటున్న చెన్నై, రాజస్థాన్ జట్ల నుంచి మొత్తంగా ఆరుగురు ఈసారి కొత్త జట్లకోసం వేలంలో అందుబాటులో ఉండనున్నారని తెలుస్తోంది. చెన్నైని ఇన్నాళ్లూ విజయవంతంగా నడిపించిన ధోనీ వేలంలో ఉంటే... ఎంతకు అమ్ముడుపోతాడో చూడాల్సి ఉంది.

English summary
After CSK suspension, Mahendra Singh Dhoni looking to switch side: Report
మీ వ్యాఖ్య రాయండి