Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఘర్షణ: గంభీర్‌, తివారీలకు భారీ జరిమానా

Published: Sunday, October 25, 2015, 12:46 [IST]

న్యూఢిల్లీ: రంజీ మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో ప్రత్యర్థి ఆటగాడిపై దురుసుగా ప్రవర్తించిన ఢిల్లీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ మ్యాచ్‌ ఫీజులో 70 శాతం జరిమానాగా ఎదుర్కొన్నాడు. అలాగే మనోజ్‌ తివారికి కూడా మ్యాచ్‌ ఫీజులోనూ 40 శాతం జరిమానా విధించారు.

ఈ విషయాన్ని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) మేనేజర్‌ సమీర్‌ దాస్‌గుప్తా తెలిపాడు. ‘మ్యాచ్‌ ఫీజులో మనోజ్‌కు 40 శాతం, గంభీర్‌కు 70 శాతం జరిమానా విధిస్తున్నట్టు మ్యాచ్‌ రెఫరీ వాల్మీక్‌ బచ్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. దీనిపై ఇక విచారణ ఉండదు. అలాగే ఇద్దరిలో ఎవరిపైనా నిషేధం విధించడం లేదని వాల్మీక్‌ చెప్పాడు'ని దాస్‌గుప్తా పేర్కొన్నాడు.

కాగా, ఘర్షణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే. ఢిల్లీ, పశ్చిమబెంగాల్ మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు గౌతం గంభీర్, మనోజ్ తివారీ శనివారంనాడు కొట్టుకున్నారు. ఎంపైర్ శ్రీనాథ్‌ను కూడా గంభీర్ తోసివేసినట్లు తెలిసింది. మ్యాచ్ రిఫరీ గౌతం గంభీర్, మనోజ్ తివారీకీ సమన్లిచ్చారు. గౌతం గంభీర్, మనోజ్ తివారీ తొలుత తిట్టుకున్నారు. ఆ తర్వాత కొట్టుకున్నారు.

Gautam Gambhir, Manoj Tiwary Fined for On-Field Altercation

మ్యాచ్ ఎనిమిదో ఓవర్‌ సందర్భంగా తివారీకి, గౌతం గంభీర్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్ ఎనిమిదో ఓవరులో మనన్ శర్మానంద్ బౌలింగులో పార్థ సారథి భట్టాచార్జీ ఔటైన తర్వాత నాలుగో స్థానంలో తివారీ బ్యాటింగ్‌కు దిగాడు. తివారి బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే అకస్మాత్తుగా బౌలర్‌ను ఆపి, హెల్మెట్ కోసం డ్రెసింగ్ రూంవైపు సైగ చేశాడు.

సమయాన్ని వృధా చేసే ఎత్తుగడలో భాగంగానే తివారీ ఆ విధంగా చేశాడని ఢిల్లీ ఆటగాళ్లు భావించారు. అకస్మాత్తుగా స్లిప్‌లో బౌలింగు చేస్తున్న గంభీర్ రంగంలోకి దిగి బెంగాల్ స్కిప్పర్ తివారీని దూషించడం ప్రారంభించాడు. తివారీ దీటుగా జవాబిచ్చాడు. సాయంత్రం రా, నీ సంగతి చూస్తా అంటూ గంభీర్ హెచ్చరించాడు, సాయంత్రం దాకా ఎందుకు, ఇప్పుడే బయటకు వెళ్లి చూసుకుందాం, పద అని తీవారీ అన్నాడు.

ఆ సమయంలో అంపైర్ శ్రీనాథ్ జోక్యం చేసుకున్నాడు. తివారీ, గంభీర్‌ల మధ్య కొట్లాటను అదుపు చేసేందుకు యత్నించిన ఎంపైర్ శ్రీనాథ్‌ను గంభీర్ తోసివేసినట్లు తెలిసింది. తమ గొడవ మధ్యలోకి రావద్దని హెచ్చరించినట్లు సమాచారం. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రంజీ మ్యాచ్ సందర్భంగా గౌతం గంభీర్, మనోజ్ తివారీ కొట్టుకున్న ఘటనలో మ్యాచ్ రిఫరీ కన్నెర్ర చేసినట్లు తెలిసింది. కాగా, ఈ నేపథ్యంలో ఇద్దరు ఆటగాళ్లకు భారీ జరిమానాతో సరిపెట్టారు.

English summary
Both Gautam Gambhir and Manoj Tiwary were penalised 70 percent and 40 percent respectively for their verbal spat during the Ranji Game at the Feroz Shah Kotla ground.
మీ వ్యాఖ్య రాయండి