Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అమ్లా సరికొత్త రికార్డ్: విరాట్ కోహ్లీ రికార్డ్ దాటేశాడు

Posted by:
Published: Sunday, October 25, 2015, 14:44 [IST]

ముంబై: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్సుమెన్ హషీమ్ ఆమ్లా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో వేగవంతమైన ఆరువేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో అతడు ఈ ఘనతను సాధించాడు. 126 మ్యాచులలో 123 ఇన్నింగ్స్ ఆడి ఈ రికార్డ్ సాధించాడు.

Hashim Amla Breaks Virat Kohli's Record

భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆమ్లా 23 పరుగులు చేసి అవుటయ్యాడు. వ్యక్తిగత 15 పరుగులకు చేరుకోగానే ఆరువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇంతవరకూ విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు.

కోహ్లి 144 మ్యాచుల్లో 136 ఇన్నింగ్స్ ఆడి ఆరు వేల పరుగులు పూర్తి చేశాడు. రిచర్డ్స్, గంగూలీ, డివిలియర్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు 126 వన్డేలు ఆడిన ఆమ్లా 6008 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. 84 టెస్టులు ఆడి 23 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 6770 పరుగులు చేశాడు.

English summary
Hashim Amla finally had reasons to smile in this series when he became the fastest batsman to go past 6000 runs in ODIs.
మీ వ్యాఖ్య రాయండి