Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఇంకా సెట్ కాలేదు, నిలకడ అవసరం: ధోనీ

Published: Monday, October 26, 2015, 16:01 [IST]

ముంబై: వన్డే క్రికెట్‌లో తమ జట్టు ఇంకా పూర్తి స్థాయిలో సెట్ కాలేద(స్థిరపడలేదు)ని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం అనంతం ధోనీ మీడియాతో మాట్లాడాడు. బ్యాటింగ్‌తో పాటు, ఇటు బౌలింగ్‌లోనూ జట్టు పూర్తిగా కుదురుకోలేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని చెప్పాడు.

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 438 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక భారత ఆటగాళ్లు ఘోర పరాజయాన్ని చవిచూశారు. టీమిండియా ఆటగాళ్ల చెత్త ప్రదర్శనతో టీమిండియా 224 పరుగులు చేసి చేతులెత్తేసింది. దీంతో 214 తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.

‘జట్టులో అస్థిరత ఎక్కువగా కనబడుతోంది. భారత క్రికెటర్లలో ప్రతిభకు కొదవ లేకపోయినా, వారి నిలకడగా రాణించకపోవడమే వైఫల్యాలు కారణం. దీనిపై నిశితంగా దృష్టి పెట్టాల్సింది ఉంది' అని ధోని పేర్కొన్నాడు.

 Our team doesn't look settled, says Dhoni after 214-run loss

మ్యాచ్ డిసైడర్‌గా పేరున్న ధోని మరోసారి విఫలం చెందడంపై ఏమి చెబుతారనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘అసలు చివరి వన్డే మ్యాచులో ఏం జరిగిందనేది దానిపై దయచేసి అడగకండి. స్కోరు బోర్డుపై దాదాపు 450 పరుగులు ఉన్నప్పుడు కూడా ధోని ఏం చేశాడు అని అడుతున్నారా' చమత్కరించాడు.

దక్షిణాఫ్రికా చేసిన స్కోరును ఛేదించడం కష్టసాధ్యమని తెలిపాడు. దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 20 నుంచి 25 ఓవర్ల మధ్య కొంత మేర తమ అధీనంలోనే ఉందని.. తరువాత పరిస్థితులు అనుకూలించకపోవడంతో మ్యాచ్‌పై పట్టుజారిందని ధోని తెలియజేశాడు.

సఫారీలు బ్యాటింగ్ అద్భుతమంటూ మిస్టర్ కూల్ ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే భారత బౌలర్లు మరింత శక్తివంతంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. అలాగే జట్టుకు ఆల్ రౌండర్ల అవసరం ఉందని చెప్పాడు.

English summary
Once again harping on the "process" after India's embarrassing 214-run loss against South Africa in the fifth and final ODI, captain Mahendra Singh Dhoni insisted that issues need to be addressed soon to get the national cricket team in order.
మీ వ్యాఖ్య రాయండి