Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సెహ్వాగ్ కొడితే క్యాచ్ పట్టొద్దు: ఫ్యాన్స్ అప్‌సెట్ చేశారు!

Posted by:
Published: Monday, October 26, 2015, 16:08 [IST]

మైసూరు: సొంత మైదానంలో ఆడటం ఏ జట్టుకైనా లేదా ఏ ఆటగాడిగైనా ప్రత్యేక అనుభూతి. అయితే, కర్నాటక ఆటగాళ్లను అడిగితే మాత్రం భిన్నమైన సమాధానం రావొచ్చు. రంజీ ట్రోఫీలో భాగంగా మైసూరులో జరిగిన మ్యాచ్ సందర్భంగా కొందరు అభిమానుల తీరు సొంత ఆటగాళ్లను నిరుత్సాహపరిచింది.

స్థానిక స్టేడియంలో తమకు పలువురు అభిమానుల నుంచి మద్దతు లేదని రాబిన్ ఊతప్ప ఆదివారం నాడు చెప్పాడు. పలు సందర్భాల్లో తమకు ఈ చేదు ఎదురైందని చెబుతున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఆదివారం హర్యానాతో జరిగిన మ్యాచ్‌ను కర్నాటక డ్రాతో సరిపెట్టుకుంది.

Sehwag gets support; Karnataka players booed, Robin Uthappa'abused'

హర్యానా తరఫున ఆడుతున్న వీరేంద్ర సెహ్వాగ్‌కు మైసూరులో మంచి మద్దతు లభించింది. అంతేకాదు, స్టేడియంలోని పలువురు అభిమానులు... సెహ్వాగ్ ఇచ్చే క్యాచ్‌ను వదిలేయాలని సొంత (కర్నాటక) జట్టు ఆటగాళ్లకు పదేపదే సూచించారు.

Sehwag gets support; Karnataka players booed, Robin Uthappa'abused'

కర్నాటకలో వీరేంద్ర సెహ్వాగ్‌కు మంచి మద్దతు లభించింది. దీనిపై ఊతప్ప స్పందిస్తూ.... వీరేంద్ర సెహ్వాగ్ కచ్చితంగా లెజెండ్ అన్నాడు. అయితే, సొంత మైదానంలో అభిమానులు తమకు మద్దతు ఇవ్వకపోవడం అసంతృప్తికి గురి చేసిందని చెప్పాడు. కాగా ఊతప్ప వ్యాఖ్యల పైన కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ మాట్లాడుతూ... ఇది దురదృష్టమన్నాడు. ఆయన మాటలతో నేను ఆశ్చర్యపోయానని చెప్పాడు.

English summary
The feeling of playing at home is always special for any team. But ask a Karnataka player and you get a different answer. The Ranji Trophy holders are disappointed with the attitude of some fans in Mysuru and want their game to be shifted out of the royal city.
మీ వ్యాఖ్య రాయండి