Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టీం మాటేంటి?: రవిశాస్త్రిని తప్పుబట్టిన ఫ్యాన్స్, ట్వీట్లు

Posted by:
Published: Tuesday, October 27, 2015, 13:02 [IST]

ముంబై: భారత్ - దక్షిణాఫ్రికా ఐదో వన్డే ఓటమి అనంతరం వాంఖేడే స్టేడియం పిచ్ క్యురేటర్ సుధీర్ నాయక్ పైన రవిశాస్త్రి వ్యవహరించిన తీరు పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివి సరికాదని పలువురు సీనియర్లు అభిప్రాయపడ్డారు.

ఐదో వన్డే ఓటమి అనంతరం పిచ్ క్యురేటర్ సుధీర్ నాయక్ వద్దకు వెళ్లిన రవిశాస్త్రి... పిచ్ చాలా బాగుందని ఎద్దేవా చేశారు. దానికి సుధీర్ నాయక్ కూడా ఘాటుగానే స్పందించాడు. తనకు పాఠాలు చెప్పవలసిన పని లేదని కౌంటర్ ఇచ్చాడు.

From Twitter: Ravi Shastri under attack for 'abusing' pitch curator Sudhir Naik

దీనిపై సుధీర్ నాయక్ ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు (ఎంసిఏ) ఫిర్యాదు చేశారు. ఎంసీఏ జాయింట్ సెక్రటరీ ఉన్మేష్ ఖన్విల్కర్ మాట్లాడుతూ... తాము సుధీర్ నాయక్ నుంచి ఫిర్యాదు లేఖ అందుకున్నామని, రవిశాస్త్రితో పాటు అరుణ్ తనతో వాగ్వాదానికి దిగినట్లుగా పేర్కొన్నాడని చెప్పారు.

రవిశాస్త్రి తీరు పైన మాజీ ఆటగాళ్లు స్పందించారు. సుధీర్ నాయక్ పట్ల రవిశాస్త్రి తీరు సరికాదని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. రవిశాస్త్రి క్యురేటర్‌ను నిందించే బదులు... ధీటుగా ఆడని జట్టును తప్పుపట్టాలని వినోద్ కాంబ్లీ ట్వీట్ చేశాడు. మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు కూడా రవిశాస్త్రిని తప్పుబట్టారు.

English summary
India's humiliating 214-run defeat to South Africa in the 5th ODI at Mumbai's Wankhede Stadium on Sunday (October 25) has resulted in Team Director Ravi Shastri and Bowling Coach Bharat Arun targetting the pitch curator Sudhir Naik.
మీ వ్యాఖ్య రాయండి