Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్: సచిన్, వార్న్ సూచన

Published: Tuesday, October 27, 2015, 16:53 [IST]

లండన్: ఇటీవలి కాలంలో ట్వంటీ20 క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడిక ఈ ఆటను ఒలింపిక్స్‌లో వేశపెట్టాలనుకుంటున్నారు ఒలింపిక్స్ కమిటీ సభ్యులు. ఆ ఆలోచనకు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌లు కూడా పూర్తి మద్దుతు పలుకుతున్నారు.

ట్వంటీ20ని వాళ్లు ఒలింపిక్ ఆటగా చూడాలనుకుంటున్నట్లు వారిద్దరూ తెలిపారు. కాగా, 1900 సంవత్సరంలో చివరి సారి క్రికెట్ ఆటకు ఒలింపిక్స్‌లో చోటుదక్కింది. అయితే ప్రజాదరణ ఉన్న క్రికెట్‌ను మళ్లీ ఒలింపిక్స్‌లో పరిచయం చేయాలనుకుంటున్నారు. దీని కోసం ఒలింపిక్ కమిటీతో ఐసిసి చర్చించనుంది.

Sachin Tendulkar & Shane Warne want cricket at Olympic Games

వచ్చే నెలలో జరగనున్న సదస్సులో బిడ్డింగ్ గురించి కూడా మాట్లాడనున్నారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడాలని ఇష్టపడుతున్నానని, ఆ రోజు త్వరలో వస్తుందని భావిస్తున్నట్లు వార్న్ బిబిసి ఛానల్‌కు తెలిపాడు.

ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చాలన్న ఐడియా అద్భుతమని, అది టీ20 ఫార్మాట్ అయితే ఇంకా బాగుంటుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు దిగ్గజాలు వచ్చే నెల అమెరికాలో జరగన్ననున్న ఆల్ స్టార్స్ సిరీస్‌లో పాల్గొనున్నారు.

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని మేటి క్రికెటర్లు కోరుతున్న కారణంగా ఐసిసి కూడా ఈ అంశాన్ని ఒలింపిక్ కమిటీకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. 2024 ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలని ఇప్పటికే కొన్ని క్రికెట్ సంఘాలు విజ్ఞప్తులు చేశాయి. ఒకవేళ ఒలింపిక్స్ కమిటీ ట్వంటీ20 క్రికెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. క్రికెట్ అభిమానులు ఇకపై ఒలింపిక్స్‌లోనూ క్రికెట్ ఆటను ఆస్వాదించొచ్చు.

English summary
All-time greats Sachin Tendulkar and Shane Warne have called for Twenty20 cricket to become an Olympic sport.
మీ వ్యాఖ్య రాయండి