Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఇప్పుడే పెళ్లి వద్దంటున్న కోహ్లీ ప్రియురాలు అనుష్క

Posted by:
Published: Wednesday, October 28, 2015, 14:59 [IST]

ముంబై: భారత్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ... ఇప్పుడప్పుడే తాను పెళ్లి చేసుకుంటాననే ఊహాగానాలను తిప్పికొట్టారు. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పింది. అనుష్క శర్మ... విరాట్ కోహ్లీతో ప్రేమలో మునిగిపోయిన విషయం తెలిసిందే.

ఇటీవలే ప్రియుడు కోహ్లీతో పాటు తన తండ్రితో కలసి అనుష్క కనిపించింది. దీంతో, త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయనే పుకార్లు వచ్చాయి. ఇప్పటికే ఇంటికోసం గాలిస్తున్నారని, ఇరు కుటుంబాలు కలసి త్వరలోనే వివాహ తేదీని నిర్ణయిస్తారని వార్తలు వచ్చాయి.

Anushka Sharma denies marriage rumours with boyfriend Virat Kohli

దీనిపై అనుష్క శర్మ స్పందించింది. ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని, వాటిని నమ్మరాదని అనుష్క శర్మ ప్రతినిధి ప్రకటించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో అనుష్క చాలా బిజీగా ఉందని, కెరీర్, జీవితం గురించి ఆమెకు పూర్తి స్పష్టత ఉందని తెలిపాడు. సమయం వచ్చినప్పుడు తన పెళ్లి గురించి అనుష్కే చెబుతుందన్నాడు.

మానసిక వికలాంగ చిన్నారులతో గడిపిన ధోనీ

మహేంద్ర సింగ్‌ ధోనీ మంగళవారం రాత్రి పూణెలో మానసిక వికలాంగ చిన్నారులతో గడిపారు. ముకుల్‌ మాధవ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శారీరక, మానసిక వికలాంగ చిన్నారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ధోని అక్కడి చిన్నారులతో గడిపి వారికి బహుమతులు అందించారు. చిన్నారులతో కలిసి ధోనీ ఫోటోలు దిగారు.

English summary
India Test cricket team captain Virat Kohli’s recent weekend outing with actress, girlfriend Anushka Sharma and her father sparked off speculations of marriage in the near future.
మీ వ్యాఖ్య రాయండి