Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నోరు అదుపులో పెట్టుకోవాలి!: రవిశాస్త్రికి గవాస్కర్

Posted by:
Published: Wednesday, October 28, 2015, 13:48 [IST]

బెంగళూరు: ఐదో వన్డే అనంతరం వాంఖేడే పిచ్ క్యురేటర్ సుధీర్ నాయక్ పైన టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి చేసిన కామెంట్స్ పైన చర్చ సాగుతోంది. అసలు రవిశాస్త్రి అతని పట్ల అనుచితంగా ప్రవర్తించారా లేదా ఇంకా కచ్చితంగా తెలియడం లేదని సమాచారం.

అయితే, సునీల్ గవాస్కర్ ఈ అంశం గురించి మాట్లాడుతూ... ఎవరైనా భాష విషయంలో అదుపులో ఉండాలన్నాడు. ఆతిథ్య జట్లకు అనుకూలంగా పిచ్‌లు తయారు చేయించుకోవడంలో తప్పేమీ లేదన్నాడు. ఐదో వన్డే పిచ్‌ విషయంలో క్యురేటర్‌ను తిట్టిపోసిన రవిశాస్త్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్పందించాడు.

Shastri-Naik spat: 'Have control over your language', says Sunil Gavaskar

ఆతిథ్య జట్లకు అనుకూలించేలా పిచ్‌లు ఉండాలనుకోవడంలో తప్పేమిటన్నాడు. పిచ్‌లు కోరుకున్నట్లు లేనపుడు అసహనం కలుగుతుందన్నాడు. ఐతే భాష విషయంలో కొంచెం హద్దుల్లో ఉండాలన్నాడు. నిరాశలో ఉన్నపుడు ఏదో మాట్లాడేసి.. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందడం మామూలేనన్నాడు.

తాను అసభ్య పదజాలం వాడలేదని గవాస్కర్ వివరణ ఇచ్చాడు. క్యురేటర్‌ సుధీర్‌ మాత్రం రవి అలాగే మాట్లాడాడని చెబుతున్నాడు. ఎవరి వాదన వారిదిగా ఉంది.

సాధారణంగా జట్టు యాజమాన్యం తమకెలాంటి పిచ్‌ కావాలో రాష్ట్ర క్రికెట్‌ సంఘానికి చెబుతుంది. ఆ సంఘమే క్యురేటర్‌కు మార్గదర్శకాలు ఇస్తుంది. మరి ఇక్కడ ముంబై క్రికెట్‌ సంఘం ఏం చెప్పిందన్నది కీలకంగా మారింది. ఐతే జట్టు కోరుకున్న పిచ్‌ దక్కకపోవడం కొత్తేమీ కాదు. కాబట్టి ఓటమి గురించి ఆలోచించకుండా ముందుకెళ్లిపోవాలని గవాస్కర్ అన్నాడు.

English summary
It is still not clear whether Team India Director Ravi Shastri "abused" the Wankhede Stadium pitch curator Sudhir Naik. But former India captain Sunil Gavaskar while commenting on the issue, has said, "you should have control over your language".
మీ వ్యాఖ్య రాయండి