Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్‌కు ఓటమి భయం, పాక్ వద్దు: మియాందాద్

Published: Thursday, October 29, 2015, 12:24 [IST]

కరాచీ: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ జావేద్‌ మియాందాద్‌ మరోసారి భారత్‌ క్రికెట్‌ నియంత్రణ మండలి (బిసిసిఐ)పై విరుచుకుపడ్డాడు. ఈ ఏడాది చివర్లో యూఏఈ వేదికగా జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌పై బిసిసిఐ ఎటూ తేల్చకపోవడంపై జావేద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడుతుందన్న భయంతోనే బిసిసిఐ ఈ సిరీస్‌ను నిర్వహించడం లేదని మియాందాద్‌ అన్నాడు. భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే టి-20 ప్రపంచ కప్ టోర్నీకి జట్టును పంపవద్దని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి జావేద్ మియందాద్ సూచించాడు.

India afraid of losing to Pakistan, claims Javed Miandad

తమ దేశంతో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై నిరాసక్తంగా ఉన్న భారత్‌కు సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ భారత్‌కు వెళ్లి, మూడు రోజులు వేచి చూసినప్పటికీ బిసిసిఐ స్పందిం చకపోవడం దురదృష్టకమని అన్నాడు.

షహర్యార్‌కు వ్యతిరేకంగా కొంత మంది నినాదాలు చేయడం, బిసిసిఐ కార్యాలయంపై దాడికి దిగడం వంటి సంఘటనలు భారత్‌లో పాక్ ఆటగాళ్ల భద్రతపై అనుమానాలకు కారణమవుతున్నాయని అన్నాడు.

కాగా, ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల ఒప్పందం ప్రకారం.. 2015 నుంచి 2023 వరకు పాక్‌-భారత్‌ మధ్య 6 సిరీస్‌లు నిర్వహించాల్సి ఉంది. 2008లో ముంబై దాడుల తర్వాత పాక్‌తో భారత్‌ పూర్తిస్థాయి సిరీస్‌ ఆడలేదు.

English summary
Legendary Pakistan cricketer Javed Miandad has lashed out at the Board of Control for Cricket in India (BCCI), saying that the latter doesn't want to revive the UAE series because they are afraid of losing.
మీ వ్యాఖ్య రాయండి