Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నన్నుఎందుకు తీసుకోలేదో, కోహ్లీ చెప్పాడు: హర్భజన్

Posted by:
Published: Thursday, October 29, 2015, 12:26 [IST]

ముంబై: భారత టెస్ట్ టీంలోకి తనను తీసుకోకపోవడానికి గల కారణాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి తనకు చెప్పాడని హర్భజన్‌ సింగ్ అన్నాడు. దక్షిణాఫ్రికా టాప్‌ ఆర్డర్లోని ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కుడి చేతి వాటం ఆటగాళ్లేనని, అందుకే ఓ ఎడమచేతి వాటం స్పిన్నర్‌ను తీసుకోవాలని భావించి జడేజాకు చోటిచ్చామని కోహ్లి చెప్పాడన్నాడు.

విరాట్‌ కోహ్లీ తనకు అలా సర్దిచెప్పడం సంతోషాన్ని ఇచ్చిందని భజ్జీ అన్నాడు. అయితే టెస్టు జట్టులో మళ్లీ చోటు దక్కించుకోవడానికి శ్రమిస్తానని తెలిపాడు. భారత్ - దక్షిణాప్రికా సిరీస్‌లో తన బౌలింగ్ వ్యక్తిగతంగా తనకు సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు.

Virat Kohli tells Harbhajan Singh why he wasn't picked in Test team

సౌతాఫ్రికా జట్టులో ముగ్గురు రైట్ హ్యాండ్ బ్యాట్సుమెన్.. హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్, ఏబీ డివిల్లీయర్స్ ఉన్నారు. ఈ కారణంగానే రవీంద్ర జడెజాను తీసుకున్నట్లు కోహ్లీ... భజ్జీతో చెప్పాడు. కాగా, భజ్జీ ఇంకో 17 వికెట్లు తీస్తే కపిల్‌ (434)ను అధిగమించి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌ అవుతాడు.

English summary
The Indian bowlers had a torrid time against South African batting line-up led by AB de Villiers but senior off-spinner Harbhajan Singh on Wednesday said he “enjoyed the challenge” as he managed to hold his own for the better part of the limited overs series.
మీ వ్యాఖ్య రాయండి