Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

క్రికెట్‌కు ఆకర్షణ వారే: కోహ్లీ, స్టెయిన్‌పై బ్రెట్ లీ

Published: Friday, October 30, 2015, 13:36 [IST]

ముంబై: నేటి తరంలో క్రికెట్‌కు ఆకర్షణగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా ఆటగాడు డేల్ స్టెయిన్ నిలుస్తున్నారని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసించాడు. ఇలాంటి ఆటగాళ్లే క్రికెట్‌ను ఆసక్తికరంగానూ, ఆకర్షణీయంగానూ మారుస్తున్నారని అన్నాడు.

గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బ్రెట్ లీ మీడియాతో ముచ్చటించాడు. ఆండ్రూ సైమండ్స్, షోయబ్ అక్తర్, శ్రీశాంత్, ఆండ్రె నెల్, కోహ్లీ, స్టెయిన్ వంటి ఆటగాళ్లు తమ దూకుడుతో ప్రేక్షకులకు చేరువయ్యారని చెప్పాడు. ప్రస్తుతం క్రికెట్‌కు అలాంటి ఆటగాళ్ల అవసరం ఉందన్నాడు.

2018 ఆసియా కప్‌ భారత్‌లో

Brett Lee: Virat Kohli, Dale Steyn are characters that keep the game exciting

వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ బంగ్లాదేశ్‌లో జరగనుందని, 2018లో టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుందని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఈ టోర్నీ ద్వారా ఆసియా దేశాలు టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యే అవకాశం లభిస్తుందన్నారు.

సింగపూర్‌లో జరిగిన ఆసియా క్రికెట్ మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గత పర్యాయం కూడా బంగ్లాదేశే ఆతిథ్యమిచ్చినా, వర్షాల కారణంగా శ్రీలంక, పాకిస్థాన్‌లలో టోర్నీకి ఆటంకం కలిగే అవకాశం ఉండటంతో మళ్లీ ఆ దేశానికే టోర్నీ నిర్వహణ అవకాశాన్ని ఇచ్చినట్టు చెప్పారు.

కాగా, 2019లో ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో 2018 ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.

English summary
Legendary fast bowler Brett Lee said on Thursday that the presence of players like Virat Kohli and Dale Steyn on the cricket field makes the game more exciting but pointed out that players should control their aggression and should know where to draw the line.
మీ వ్యాఖ్య రాయండి