Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మిస్బా! అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించకు: బోర్డు విజ్ఞప్తి

Posted by:
Published: Friday, October 30, 2015, 13:22 [IST]

కరాచీ: అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించవద్దని పాకిస్థాన్‌ సారథి మిస్బా ఉల్ హక్‌‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) కోరుతోంది. మిస్బా వయసు 41 ఏళ్ల పైనే. అయితే లేటు వయసులోను అద్భుతమైన ఆటతో అతను అలరిస్తున్నాడు.

 PCB urges Misbah to delay retirement

ప్రస్తుత ఇంగ్లాండ్‌ సిరీస్‌ అనంతరం టెస్టులకూ వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు. అయితే, పిసిబి రిటైర్మెంట్‌ ఆలోచనను ఇంకో ఏడాది వాయిదా వేసుకోవాలని అతడికి విజ్ఞప్తి చేసింది. అతడి సేవలు జట్టుకు అమూల్యమని పేర్కొంది.

వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ అతడి అవసరం ఎంతో ఉందని, అందుకే రిటైర్మెంట్‌ ఆలోచనను వాయిదా వేసుకోవాలని కోరామని అని పీసీబీ ఛైర్మన్‌ షహర్యార్‌ ఖాన్‌ గురువారం నాడు తెలిపాడు. తాము ఇదే విషయాన్ని అతనికి చెప్పామన్నాడు.

English summary
Test captain Misbah-ul-Haq has been asked by the PCB to continue in his role for next year's tour to England and put off any retirement plans.
మీ వ్యాఖ్య రాయండి