Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోనీ, వాట్సన్...: ఐపీఎల్లో 10 మందికి వేలం ఉండదు

Posted by:
Published: Friday, October 30, 2015, 13:42 [IST]

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల స్థానంలో రాబోయే రెండేళ్లకు మరో రెండు కొత్త జట్లను ఐపీఎల్లోకి తీసుకు రావాలని బిసిసిఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లలోని ఆటగాళ్ల సంగతి పైన కూడా బిసిసిఐ చర్చిస్తోంది.

పాత జట్ల ఆటగాళ్లను కొత్త ఫ్రాంచైజీలకు వీటికి బదలాయిస్తారా? లేక అందరినీ వేలంలోకి తెస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐ ఓ అభిప్రాయంతో ఉంది. ఇరు ఫ్రాంఛైజీల్లో తలో ఐదుగురు అగ్రశ్రేణి ఆటగాళ్లను మినహాయించాలని భావిస్తోంది.

Ten CSK, Royals players to go into draft

మిగతా ఆటగాళ్లను వేలంలోకి తేవాలని నిర్ణయించింది. రెండు కొత్త ఫ్రాంఛైజీల్లో ఒక్కొక్కటి ఐదుగురి చొప్పున ఎంచుకుంటుంది.

చెన్నై ఫ్రాంఛైజీలో మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్‌, బ్రెండన్ మెక్‌కలమ్, రాజస్థాన్‌ ఆటగాళ్లలో షేన్ వాట్సన్‌, స్టీవెన్‌ స్మిత్, అజింక్యా రహానె లాంటి వాళ్లను మినహాయించే అవకాశముందని తెలుస్తోంది.

English summary
Five players from each of the two suspended teams, CSK and RR, will be allowed to be picked by the two new franchises for the next two years of the IPL, which will continue to remain an eight-team tournament until 2017.
మీ వ్యాఖ్య రాయండి