Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

దీపావళికి యువీ పెళ్లి, భజ్జీతో చర్చ: వధువు ఆమేనా?

Published: Saturday, October 31, 2015, 14:50 [IST]

న్యూఢిల్లీ: భారత ఆల్ రౌండర్ యువరాజ్‌ సింగ్‌ దీపావళి తర్వాత తన పెళ్లి వార్తను అందరికీ చెప్పబోతున్నాడా..? అంటే ఔననే అంటున్నాయి అతని ట్వీట్లు. ట్విటర్లో తన మిత్రుడు హర్భజన్‌ సింగ్‌తో అతడి ట్వీట్లు పెళ్లిపై వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.

గురువారం బాలీవుడ్‌ నటి గీతా బస్రాను భజ్జీ పెళ్లాడిన సంగతి తెలిసిందే. కాగా, శుభాకాంక్షలు తెలుపుతూ యువీ.. ‘ఇక నుంచి దూస్రా వేయడానికి వీల్లేదు భజ్జీ. ఒకే లైన్‌కు కట్టుబడాలి' అని కొత్త పెళ్లికొడుకుకు చురకంటించాడు.

దీనికి స్పందించిన హర్భజన్ ‘నువ్వు కూడా మా లైన్లోకి రావాల్సిందే' అని ట్వీట్ చేశాడు. దీనికి స్పందనగా ‘ఈ దీపావళి తర్వాత నుంచి నా బాట కూడా అదే' అని బదులిచ్చాడు యువరాజ్.

అంటే.. ఈ దీపావళి తర్వాత యువరాజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని అర్థం చేసుకోవచ్చన్న మాట! యువీ పెళ్లికి సిద్ధమయ్యాడని అనుకుంటే.. అప్పుడు వధువు ఎవరైవుంటారు? అనే సందేహాలు కూడా వస్తున్నాయి.

కాగా, గతంలో యువీ.. బాలీవుడ్ నాయికలు కిమ్ శర్మ, దీపిక పదుకోన్, ప్రీతి జింగానియా తదితర ముద్దుగుమ్మల్ని వెంటేసుకు తిరిగినా.. ఇప్పుడు మాత్రం బ్రిటీష్ మోడల్, బాలీవుడ్ నటి అయిన హజీల్ కీచ్‌తో ఎఫైర్ నడుపుతున్నాడు. మరి! యువరాజ్ ఈమెనే పెళ్లి చేసుకుంటాడా? లేక మరెవరైనా ఉన్నారా? అనేది మరికొద్ది రోజుల్లోనే తేలే అవకాశం ఉంది.

బౌన్సర్ల అరెస్టు:

హర్భజన్‌ పెళ్లి సందర్భంగా అతిగా ప్రవర్తించిన నలుగురు బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు.
జలంధర్‌లో హర్భజన్‌ ఇంటి వద్ద గురువారం మీడియా ప్రతినిధులతో కొంతమంది బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించడేమే కాకుండా.. కెమెరాలు కూడా లాక్కున్నారు.

ఈ ఘటనపై భజ్జీ క్షమాపణలు కూడా కోరాడు. తన పెళ్లికి సంబంధించిన వీడియోల ప్రసారహక్కులు అతడు ఓ వార్తా ఛానెల్‌కు అమ్మిన నేపథ్యంలోనే బౌన్సర్లు ఇలా వ్యవహరించినట్లు సమాచారం.

English summary
Indian all-rounder Yuvraj Singh has taken newly-married Harbhajan Singh's advice and is set to "play straight" from next month.
మీ వ్యాఖ్య రాయండి