Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జిడిపిలో ఐపిఎల్ వాటా రూ.1,150 కోట్లు

Published: Saturday, October 31, 2015, 14:58 [IST]

న్యూఢిల్లీ: నిరుటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్ ద్వారా భారత జిడిపికి రూ.1150 కోట్ల మేరకు ఆర్థిక లబ్ధి చేకూరిందని బిసిసిఐ తరఫున ప్రముఖ ఫైనాన్షియల్ ఆడిట్ సంస్థ కెపిఎంజి నిర్వహించిన ఓ సర్వే అంచనా వేసింది. 2015 సీజన్‌కుగాను భారత్‌లో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లతో ముడిపడిన మొత్తం ఆర్థిక ఉత్పత్తి రూ. 2650 కోట్లుగా ఆ సంస్థ అంచనా వేసింది.

2015లో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా, లేదా ప్రేరేపిత ఆర్థిక కార్యకలాపాలన్నిటి మొత్తం విలువ ఇదని బిసిసిఐ తెలిపింది. 2015 సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లకోసం హాజరయిన విదేశీయుల్లో 20 శాతం మంది మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే నగరం కాకుండా పలు ఇతర నగరాలను సందర్శించినట్లు ఈ సర్వే అంచనా వేసింది.

అంతేకాకుండా, ఈ విదేశీ సందర్శకులు ప్రధానంగా బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలకు చెందిన వారని కూడా ఆ సర్వే తెలిపింది. ఐపిఎల్ టోర్నమెంట్ వల్ల ఆర్థికంగానే కాక ఇతరత్రా దేశంపై చూపించే ప్రభావాన్ని కూడా ఈ సర్వేలో ప్రధానంగా ప్రస్తావించింది. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చే ప్రధానమైన లాభాలు, అవకాశాలను కూడా ఆ సర్వే గుర్తించింది. వాటిలో ప్రధానమైనది పర్యాటకాభివృద్ధి.

IPL 2015 contributed Rs 1,150 crore to India's GDP: KPMG

వివిధ రంగాల్లో లభించే ఉపాధి అవకాశాలతో పాటుగా ప్రపంచ క్రీడా పటంలో భారత్ తన గుర్తింపును చెక్కుచెదరకుండా నిలబెట్టుకోవడం దాకా అనేక విధాలుగా ఈ టోర్నమెంటు వల్ల దేశానికి ప్రయోజనం కలిగిందని ఆ సర్వే అభిప్రాయ పడింది.

సర్వేపై ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. కేవలం 60 రోజుల ఈవెంట్ ద్వారా భారత జిడిపికి రూ.1150 కోట్లను అందించడం ఈ టోర్నమెంట్ ఎంతగా విజయవంతమయిందనే దానికి నిదర్శనమని అన్నాడు.

రాబోయే ఐపిఎల్ సిరీస్ ద్వారా ఈ రికార్డులను తిరగరాయడానికి, తమ భవిష్యత్తు కార్యక్రమాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని రాజీవ్ శుక్లా చెప్పాడు. కెపిఎంజి సర్వే భారత దేశ జిడిపిలో ఐపిఎల్ పాత్రను హైలైట్ చేయడంతో పాటు వివిధ రంగాలపై దాని ప్రభావాన్ని కూడా చక్కగా ఎత్తి చూపించిందని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకుర్ చెప్పాడు.

English summary
The Indian Premier League T20 cricket tournament's 2015 edition that ran for 60 days contributed Rs 1,150 crore to India's GDP, according to the KPMG Sports Advisory Group, the Indian cricket board said on Friday.
మీ వ్యాఖ్య రాయండి