Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సెహ్వాగ్ ఫన్నీ రనౌట్: ఎప్పటికీ మర్చిపోలేడు!

Posted by:
Published: Sunday, November 1, 2015, 15:09 [IST]

ఢిల్లీ: ఓ రనౌట్ భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పటికి మరిచిపోలేడు. 2007లో విశాఖపట్నంలో భారత్ - శ్రీలంకల మధ్య జరిగిన వన్డేలో సెహ్వాగ్ అవుటయ్యాడు. దీనిని సెహ్వాగ్ ఎప్పటికీ మరిచిపోలేడు.

తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేసింది. భారత్ లక్ష్యం 47 ఓవర్లలో 260 పరుగులు. లసిత్ మలింగ బౌలింగులో, 18వ ఓవర్లో సెహ్వాగ్ బంతిని ఎదుర్కొన్నాడు. మలింగ వేసిన తొలి బంతిని సెహ్వాగ్ కొట్టాడు. సింగిల్ తీశాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్‌ను మైదానంపై పెట్టలేదు.

A run out Virender Sehwag wouldn't ever forget

కుమార్ సంగక్కర... తన గ్లవ్స్ తీసేసి, బంతిని స్టంప్స్ వైపు విసిరేశాడు. ఈ సమయంలో సెహ్వాగ్‌తో పాటు బ్యాటింగ్ చేస్తున్న గంగూలీ... 'వీరూ.. వీరూ' అని కేకలు వేశాడు. బ్యాట్‌ను క్రీజు లోపల పెట్టమని చెప్పే ప్రయత్నం చేశాడు. అప్పటికే సంగక్కర్ బంతితో స్టంప్స్‌ను కొట్టాడు. థర్డ్ అంపైర్ సెహ్వాగ్‌ను అవుట్‌గా ఇచ్చాడు.

English summary
He may have been a swashbuckling batsman during his time, but Virender Sehwag was not known for two things – his footwork and his running between the wickets.
మీ వ్యాఖ్య రాయండి