Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆయనెవరు?: భజ్జీపై అకల్ తఖ్త్‌లో ఫిర్యాదు

Posted by:
Updated: Sunday, November 1, 2015, 16:23 [IST]

జలంధర్: సిక్కుల అత్యున్నత పెద్దల సంఘం అకల్ తఖ్త్‌లో టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. అకాలీదళ సీనియర్ యువ నేత జర్నైల్ సింగ్ గర్దివాల్ ఫిర్యాదు దాఖలు చేశారు.

ఈ ఫిర్యాదులో సిక్కుల పవిత్ర దేవాలయమైన గురుద్వారాలోకి భక్తులు వెళ్లకుండా హర్భజన్ సింగ్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇది సిక్కు మతస్తుల విశ్వాసాలకు వ్యతిరేకమని, గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆయనెవరని ప్రశ్నించారు.

Harbhajan Singh-Geeta Basra Marriage: Violence, dharna mar wedding celebration, case filed

పంజాబ్ లోని గురుద్వారాల్లో ఇప్పటివరకూ ఏ సెలబ్రిటీ కూడా బౌన్సర్లను వాడలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హర్భజన్‌సింగ్, బాలీవుడ్ నటి, మోడల్ గీతాబస్రాల వివాహం గురువారం జలందర్‌లో జరిగిన సంగతి తెలిసిందే.

పెళ్లి వేడుకను కెమెరాలో బంధించేందుకు యత్నిస్తున్న వారిపై బౌన్సర్లు దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన కెమెరామెన్లు, హర్భజన్ ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. విషయం తెలిసిన హర్భజన్ ఆందోళన చేస్తున్న వారికి సర్దిచెప్పి బౌన్సర్లు తరపున క్షమాపణలు తెలిపారు.

దీంతో కెమెరామెన్లు ఆందోళన విరమించారు. అయితే దాడి ఘటనపై చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ బౌన్సర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి చేసిన కేసులో హర్భజన్ బౌన్సర్లు నవజ్యోత్, కులదీప్, రవి, బబ్లూలను అరెస్టు చేశారు.

ఇది ఇలా ఉంటే, భజ్జీ, గీతా బస్రాల వివాహా విందుకు క్రికెటర్లు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతనెలలో మోడీని వ్యక్తిగతంగా కలిసి హర్భజన్‌ ఆహ్వానాన్ని అందించాడు.

అక్టోబర్‌ 29న జలంధర్‌లో భజ్జీ, గీతా వివాహాం జరిగిన విషయం తెలిసిందే. అతిథుల కోసం హర్భజన్‌ సింగ్‌ ఆదివారం సాయంత్రం దిల్లీలోని హోటల్‌ తాజ్‌ ప్యాలెస్‌లో ప్రత్యేక విందును ఏర్పాటు చేశాడు. ఈ విందుకు దాదాపు 1000 మందికి పైగా హాజరుకానున్నట్లు సమాచారం.

క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌, భారత టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఈ మధ్యనే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వీరేంద్ర సెహ్వాగ్‌ తదితర అతిథుల ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌తో పాటు నటి ప్రియాంక చోప్రా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Story first published:  Sunday, November 1, 2015, 14:43 [IST]
English summary
It was one of the most memorable days for Harbhajan Singh and Geeta Basra. After a nine-long-year of courtship, the duo tied the nuptial knots on Thursday, Oct 29.
మీ వ్యాఖ్య రాయండి