Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఢిల్లీ-ఇస్లామాబాద్ చర్చించాలి, ప్రభుత్వమే: గవాస్కర్

Posted by:
Published: Monday, November 2, 2015, 9:54 [IST]

షార్జా: భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగాలంటే.. ఇస్లామాబాద్, ఢిల్లీ చర్చలు జరపాలని (రెండు దేశాలు చర్చించాలని) మాజీ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆదివారం అన్నాడు. రెండు దేశాల మధ్య డిసెంబర్ ‌- జనవరిలో జరగాల్సిన సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ నుంచి స్పందన కోసం పిసిబి ఎదురు చూస్తోంది.

అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి కోరామని, పది రోజుల్లోగా సిరీస్ పైన జవాబిస్తామని బీసీసీఐ చెప్పింది. దీంతో సిరీస్‌ జరగడం ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య అపనమ్మకాన్ని తొలగించాలని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

 India and Pakistan must talk to revive cricket: Sunil Gavaskar

ఏ సమస్యను పరిష్కరించుకోవాలన్నా ముందు సంప్రదింపులు ముఖ్యమని చెప్పాడు. మాట్లాడుకోనంత వరకు ఏ సమస్యకూ పరిష్కారం దొరకదన్నాడు.

ఏ ఆటకూ ప్రభుత్వ అభిప్రాయాన్ని మార్చే శక్తి లేదని, అయితే రెండు దేశాలు పోటీ పడ్డప్పుడు, ఆయా దేశాల అభిమానులు వచ్చి మ్యాచ్‌లు చూసి, కలుపుగోలుగా ఉండి పరిస్థితులను అర్థం చేసుకుంటే.. ఆ పరిణామాలు ప్రభుత్వానికి ఓ సంకేతాన్నిస్తాయన్నాడు.

నేను రాజకీయ నాయకుణ్ని కాదని, ఒక మాజీ ఆటగాడిగా మాట్లాడుతున్నానని చెప్పాడు. ఏ సమస్య అయినా మాట్లాడుకుంటేనే పరిష్కారమవుతుందన్నాడు. ఐతే మాజీ ఆటగాళ్లు ఏమంటున్నారన్నది ఇక్కడ ముఖ్యం కాదని, బాగా ఆలోచించిన తర్వాతే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నాడు.

English summary
Former batting great Sunil Gavaskar believes New Delhi and Islamabad must start a dialogue to pave the way for the revival of regular matches between India and Pakistan.
మీ వ్యాఖ్య రాయండి