Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సౌతాఫ్రికాతో టెస్ట్‌కు ముందు: బ్యాట్‌తో జడెజా సత్తా

Posted by:
Published: Tuesday, November 3, 2015, 10:43 [IST]

న్యూఢిల్లీ: ఆల్ రౌండర్ రవీంద్ర జడెజా రంజీ ట్రోఫీలో బ్యాటింగ్‌లోను సత్తా చాటాడు. రంజీల్లో అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులో జడెజా చోటు దక్కించుకున్నాడు. తద్వారా తొలి టెస్టుకు ముందు బ్యాట్‌తోనూ సత్తా చాటాడు.

జడేజా 92 బంతుల్లో నాలుగు ఫోర్లతో 55 పరుగులు చేశాడు. అతను కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో గ్రూప్‌-సి రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో సర్వీసెస్‌ను ఓడించింది. 302 పరుగుల ఛేదనలో సౌరాష్ట్ర 136 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

Ravindra Jadeja shines as Saurashtra beat Services

ఈ స్థితిలో రవీంద్ర జడేజా, వాసుదేవ (57) తోడుగా ఐదో వికెట్‌కు 101 పరుగులు జత చేసి జట్టును విజయ వైపు నడిపించాడు. సర్వీసెస్‌ ఓవర్ నైట్‌ స్కోరు 311/6 వద్దే రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. సర్వీసెస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేయగా, సౌరాష్ట్ర 264 పరుగులు చేసింది.

English summary
Allrounder Ravindra Jadeja was among the three half-centurions as Saurashtra chased down a steep 302-run target to register a four-wicket win over Services in their Ranji Trophy group C match here on Monday.
మీ వ్యాఖ్య రాయండి