Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఐపీఎల్‌ సీఓఓ సుందర్‌ రామన్‌ రాజీనామా, ఆమోదం

Posted by:
Updated: Tuesday, November 3, 2015, 12:55 [IST]

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీఓఓ పదవికి సుందర్ రామన్ మంగళవారం రాజీమానా చేశారు. సుందర్‌ రామన్‌ రాజీనామాను బీసీసీఐ ఆమోదించినట్లు సమాచారం. నవబంర్ 5 నుంచి అధికారికంగా సుందర్‌ రామన్‌ రాజీనామా అమల్లోకి వస్తుంది.

ఐపీఎల్‌ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన లోథా కమిటీ సమర్పించిన నివేదికలో ఎన్ శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మేయప్పన్‌, రాజస్థాన్ రాయల్స్ సహా యజమాని రాజ్ కుంద్రాతో పాటు సుందర్‌రామన్‌ పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

Tainted Indian Premier League COO Sundar Raman steps down, BCCI accepts resignation

ఐపీఎల్‌ కుంభకోణంపై విచారణ జరిపిన లోథా కమిటీ సమర్పించిన నివేదికలో మొత్తం 14 మంది పేర్లు ఉన్న విషయం తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడిగా ఇటీవలే శశాంక్ మనోహార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి ప్రక్షాళనకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే ఐపీఎల్ సీఓఓ సుందర్‌రామన్‌ తప్పించినట్లు తెలుస్తోంది.

Story first published:  Tuesday, November 3, 2015, 12:25 [IST]
English summary
Indian Premier League Chief Operating Officer Sundar Raman has stepped down from his role on Tuesday. BCCI has reportedly accepted Raman’s resignation.
మీ వ్యాఖ్య రాయండి