Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోనీ హెలికాప్టర్ షాట్ అనుకరించి నవ్వించిన క్రిస్ గేల్

Posted by:
Published: Tuesday, November 3, 2015, 11:59 [IST]

న్యూఢిల్లీ: భారత్ వన్డే, టీ ట్వంటీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ సోమవారం నాడు ఒకే వేదిక పైన అలరించారు. ఇరువురు కూడా ఒకరి బ్యాటింగ్ షాట్లను మరొకరు అనుకరించి ఆనందాన్ని పంచారు.

క్రిస్ గేల్ మీడియా ఎదుట.. ధోనీ హెలికాప్టర్ షాట్‌ను మిమిక్రీ చేశాడు. ఆ తర్వాత ధోనీ... గేల్‌ను వికెట్ల మధ్య పరుగెత్తే విషయమై అడిగి సరదా పంచాడు.

When Chris Gayle mimicked MS Dhoni's helicopter shot

ధోనీ అడిగిన ప్రశ్నకు గేల్ సరదాగా సమాధానం చెప్పాడు. ప్రపంచంలో ఫాస్టెస్ట్ అథ్లెట్ తానే అని గేల్ చెప్పాడు. జమైకా చిరుత ఉసేన్ బోల్డ్ కంటే తాను వేగంగా పరుగెత్తుతానని సరదాగా అన్నాడు. ఈ భూమి మీద వేగంగా పరుగెత్తే అథ్లెట్ ఎవరిని ధోనీ అడిగాడు.

దానికి గేల్ స్పందిస్తూ... బోల్డ్ క్రికెట్ ఆడలేడని, నేను మాత్రం అతడికంటే వేగంగా పరుగెత్తగలనని, ఏదో ఒకరోజు ఈ అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని, అయితే ఇది ఎప్పటికీ జరగదన్నాడు. వికెట్ల మధ్య తన కంటే వేగంగా ఎవరూ పరుగెత్తలేరన్నాడు. డివిల్లీయర్స్ నా తర్వాతే ఉంటాడన్నాడు.

English summary
Two of the biggest and hardest hitters of the cricket ball, Mahendra Singh Dhoni and Chris Gayle engaged in some on stage banter at an event here on Monday, mimicking each other and having some fun.
మీ వ్యాఖ్య రాయండి