Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సౌతాఫ్రికాతో సవాలే, ఆ గొడవ ముగిసిన కథ: రవిశాస్త్రి

Posted by:
Published: Wednesday, November 4, 2015, 9:59 [IST]

ఢిల్లీ: టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు భారత జట్టు గట్టి పోటీ ఇస్తుందని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి చెప్పాడు. ఆయన మొహాలీలో మాట్లాడాడు. 2006 నుంచి విదేశీ గడ్డ పైన ఓటమే ఎరుగని దక్షిణాఫ్రికాను ఎదుర్కోవడం సవాలే అన్నాడు.

ఆతిథ్య దేశం తనకు నచ్చిన పిచ్‌ను తయారు చేసుకునే స్వేచ్ఛ ఉందని రవిశాస్త్రి ఉందని చెప్పాడు. వాంఖడే పిచ్‌ గొడవ ముగిసిన కథ అన్నాడు. ఆతిథ్య జట్లు తమ బలాలకు సరిపోయే పిచ్‌లు పొందడం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదేనని, ఇందులో దాచాల్సిందేమీ లేదన్నాడు.

గురువారం దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆరంభంకానున్న నేపథ్యంలో శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. సొంతగడ్డపై ఏ జట్టయినా తన సామర్థ్యానికి అనుగుణంగా సిద్ధమవ్వాలని, దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు తొలి రోజు నుంచే టర్న్ అయ్యే పిచ్‌లను ఆశించలేమన్నాడు.

Perfect place and perfect opposition for young side: Ravi Shastri

కాబట్టి ఇక్కడ పిచ్‌ ఎలా ఉంటుందనేది ఆసక్తికరమన్నాడు. అద్భుతమైన సిరీస్‌ మన ముందుందని, పదేళ్లలో భారత్‌ ఆడుతున్న అత్యుత్తమ సిరీస్‌ ఇదే కావొచ్చునని చెప్పాడు. స్పిన్నర్‌ అశ్విన్‌ పూర్తి ఫిట్‌నెస్‌‌తో మంచి బౌలింగ్ చేస్తున్నాడన్నాడు.

టెస్టు సిరీస్‌లో అశ్విన్‌తోనే తమకు ప్రధాన ముప్పు అన్న దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తమకు మిశ్రా, జడెజాల రూపంలో మరో ఇద్దరు మంచి స్పిన్నర్లు ఉన్నారన్నాడు. వాళ్లు అశ్విన్‌ మీదే ఎక్కువ దృష్టిపెడితే ఆ ఇద్దరూ ఆశ్చర్యకర ప్రదర్శన చేయవచ్చునని చెప్పాడు.

English summary
"I see a terrific series on our hands here, probably one of the best we have had in the last 10 years. And that's because of the cricket South Africa have played in the last few years," says Ravi Shastri, the India team director.
మీ వ్యాఖ్య రాయండి