Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

తొలి రోజు టెస్ట్ విశేషాలు: ఆరేళ్ల తర్వాత మొదటి రోజే భారత్ ఆలౌట్

Posted by:
Updated: Friday, November 6, 2015, 15:07 [IST]

మొహాలీ: భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ ఉదయం ప్రారంభమైంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సఫారీల చేతిలో టి 20, వన్డే సిరీస్‌లను కోల్పోయిన భారత జట్టు స్వదేశంలో నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది.

1st Test: Toss Report: India opt to bat first

తోలి టెస్ట్ - మొదటి రోజు - సౌతాఫ్రికా బ్యాటింగ్

- మొదటి రోజు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 28 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది. ఎల్గార్ 59 బంతుల్లో 13 పరుగులు, ఆమ్లా 34 బంతుల్లో 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

- తొమ్మిదో ఓవర్లో జడెజా బౌలింగులో డుప్లెసిస్ పెవిలియన్ చేరాడు. రెండు వికెట్లు తొమ్మిది పరుగుల వద్దనే పడ్డాయి.
- దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఏడో ఓవర్లో అశ్విన్ బౌలింగులో జిల్ అవుటయ్యాడు. అతను 17 బంతుల్లో 3 పరుగులు చేశాడు.

- - స్వదేశంలో తొలిరోజే భారత జట్టు ఆలౌట్ అయింది. ఇలా కావడం ఆరేళ్ల తర్వాత ఇది తొలిసారి.

తొలి టెస్ట్ - మొదటి రోజు - భారత్ బ్యాటింగ్

విజయ్ 136 బంతుల్లో 75 పరుగులు, ధవన్ 4 బంతుల్లో 0, పుజారా 66 బంతుల్లో 31, కోహ్లీ 4 బంతుల్లో 1, రహానే 48 బంతుల్లో 15, సాహా 1 బంతికి సున్నా, జడెజా 92 బంతుల్లో38, మిశ్రా 8 బంతుల్లో ఆరు, అశ్విన్ 42 బంతుల్లో 20, యాదవ్ 7 బంతుల్లో 5, ఆరోన్ 3 బంతుల్లో సున్నా పరుగులు చేశారు. స్టెయిన్ 3 వికెట్లు, ఫిలాండర్ 5 వికెట్లు, హార్మర్ ఒక వికెట్, ఎల్గార్ ఒక వికెట్, ఇమ్రాన్ తాహిర్ 3 వికెట్లు తీశారు.

- భారత్ 68 ఓవర్లకు 10 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది.
- 201 పరుగుల వద్దనే ఆరోన్ రూపంలో పదో వికెట్ కూడా భారత్ కోల్పోయింది.
- 9 వికెట్లు కోల్పోయిన భారత్ 201 పరుగులతో ఆడుతోంది.
- 68వ ఓవర్లో ఉమేష్ యాదవ్ అవుటయ్యాడు. అతను 7 బంతుల్లో 5 పరుగులు చేశాడు.
- ఫిలాండర్ బౌలింగులో జడెజా అవుటయ్యాడు. జడెజా 92 బంతుల్లో 38 పరుగులు చేశాడు.

- 51వ ఓవర్లో నాలుగో బంతికి అమిత్ మిశ్రా అవుటయ్యాడు. మిశ్రా 8 బంతుల్లో ఆరు పరుగులు చేశాడు.

- భారత్ 47వ ఓవర్లో మురళీ విజయ్ వికెట్‌ను కోల్పోయింది. విజయ్ 136 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఇందులో పన్నెండు ఫోర్లు ఉన్నాయి.

- ఆ తర్వాత 40వ ఓవర్లో వృద్ధిమాన్ సాహా అవుటయ్యాడు. వృద్ధిమాన్ సాహా ఒక బంతి ఆడి పరుగులేమీ చేయలేదు. మురళీ విజయ్ 116 బంతుల్లో అర్ధ సెంచరీ (52) పూర్తి చేశాడు. విజయ్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు.

- 38 ఓవర్లో రహానే అవుటయ్యాడు. రహానే అవుటయ్యే సమయానికి భారత్ స్కోర్ 102 పరుగులు. రహానే 108 బంతుల్లో 48 పరుగులు చేశాడు.

-26 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 77పరుగులు చేసింది. మూడు వికెట్లు కోల్పోయింది.

- పుజారా 66 బంతుల్లో 31 పరుగులు చేశాడు. కోహ్లీ 4 బంతుల్లో 1 పరుగు చేశాడు.
- ఆ వెంటనే 65 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ వికెట్ పడింది.
- ఆ తర్వాత ఛటేశ్వర పుజారా 63 పరుగుల వద్ద అవుటయ్యాడు.
- నాలుగు బంతులు ఆడిన ధావన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఫిలాండర్ వేశాడు. షాట్ ఆడబోయిన ధావన్ స్లిప్‌లోకి ఆమ్లాకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
- తొలి ఓవర్ సఫారీ బౌలర్ స్టెయిన్ వేశాడు.
- భారత్ ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ బ్యాటింగ్‌కు దిగారు.

భారత్ జట్టు: శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛటేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ (సారథి), అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడెజా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, వరుణ్ అరోన్, ఉమేష్ యాదవ్

సౌతాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్, స్టియాన్ వాన్ జిల్, పఫ్ డుప్లెసిస్, హషీమ్ ఆమ్లా (సారథి), ఎబీ డివిల్లీయర్స్ (వైస్ కెప్టెన్), డేన్ విలాస్ (వికెట్ కీపర్), ఫిలాండర్, సిమన్ హార్మర్, డేల్ స్టెయిన్, రబడ, ఇమ్రాన్ తాహిర్.

Story first published:  Thursday, November 5, 2015, 11:35 [IST]
English summary
On a dry pitch at the PCA Stadium, birthday boy Virat Kohli won the toss and elected to bat first against South Africa on the opening day of the 1st Test here today.
మీ వ్యాఖ్య రాయండి