Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

గెలుపుతో 2వ స్థానానికి పాక్: భారత్‌కు సాయం

Published: Thursday, November 5, 2015, 16:48 [IST]

షార్జా: ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు రెండు స్థానాలు ఎగబాకి తాజాగా ప్రకటించిన ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ద్వితీయ స్థానానికి చేరుకుంది. దీంతో టీమిండియా ఒక స్థానం ఎగబాకి నాల్గో స్థానం చేరుకుంది.

గురువారం షార్జాలో ముగిసిన మూడో టెస్టులో మిస్బావుల్ హక్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఇంగ్లాండ్ జట్టుపై 127 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

ఈ విజయంతో 4వ స్థానంలో ఉన్న పాక్, 2 స్థానాలు ఎగబాకి అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ద్వితీయ స్థానానికి చేరుకుంది. అలస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ మూడో స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోయింది. 2006 తర్వాత పాకిస్థాన్ ద్వితీయ స్థానం రావడం ఇదే తొలిసారి.

ICC Test Rankings: Victorious Pakistan rise to 2nd, help India

ఈ గెలుపుతో పాకిస్థాన్ 5 పాయింట్లు సాధించగా(101 నుంచి 106కు), సిరీస్ ఓటమి పాలైన ఇంగ్లాండ్ 3 పాయింట్లు చేజార్చుకుని 102 నుంచి 99 పాయింట్లకు పడిపోయింది.

కాగా, ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 4 టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో రాణిస్తే భారత ర్యాంకు మరిత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఒకవేళ భారత్ టెస్ట్ సిరీస్‌ను 4-0తో గెలిస్తే ద్వితీయ స్థానానికి ఎగబాకే అవకాశం ఉంటుంది.

టెస్ట్ ర్యాంకింగ్స్(పాక్-ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత నవంబర్ 5న ప్రకటించినవి)

1. దక్షిణాఫ్రికా-125 రేటింగ్ పాయింట్
2. పాకిస్థాన్-106
3. ఆస్ట్రేలియా-106
4. ఇండియా-100
5. న్యూజిలాండ్-99
6. ఇంగ్లాండ్-99
7. శ్రీలంక-93
8. వెస్టిండీస్-76
9. బంగ్లాదేశ్-47
10. జింబాబ్వే-5

English summary
Pakistan have jumped 2 places to second in the latest ICC Test Rankings Table and they have also helped India to gain a spot.
మీ వ్యాఖ్య రాయండి