Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టెస్ట్ రెండో రోజు: పుజారా అర్ధ సెంచరీ, 142 పరుగుల ఆధిక్యంలో భారత్

Posted by:
Updated: Friday, November 6, 2015, 17:12 [IST]

మొహాలీ: భారత్ పైన జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు శుక్రవారం నాడు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు అలౌట్ అయింది.  28 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో సౌతాఫ్రికా శుక్రవారం ఇన్నింగ్స్ ప్రారంభించింది. దక్షిణాఫ్రికా ఆలౌట్ అయ్యాక భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఆట ముగిసే సమయానికి భారత్ 125 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది.

తొలి టెస్ట్ - రెండో రోజు - రెండో ఇన్నింగ్స్ - భారత్ బ్యాటింగ్

- భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 142 పరుగుల ఆధిక్యంతో ఉంది.

- పుజారా 100 బంతుల్లో 63 పరుగులు, కోహ్లీ 27 బంతుల్లో 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. చివరలో పుజారా సిక్స్ కొట్టాడు. ఈ టెస్టులో ఇదే మొదటి సిక్స్.

- 37 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది.
- 95 పరుగుల వద్ద భారత్ మురళీ విజయ్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. విజయ్ 105 బంతులు ఆడి 47 పరుగులు చేశాడు.

- మొహాలీ పిచ్‌ ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో బ్యాట్స్‌మెన్లు భారీ షాట్లకు ప్రయత్నించడం లేదు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసినా ఒక బంతి కూడా బౌండరీ అవల పడకపోగా, తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా కూడా కనీసం ఒక సిక్స్‌ను కూడా నమోదు చేయలేకపోయింది.

- భారత్ 18 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. ఆచితూచి ఆడుతోంది.
- శిఖర్ ధావన్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోను డకౌట్ అయ్యాడు.
- సౌతాఫ్రికా ఆలౌట్ అయిన అనంతరం.. మురళీ విజయ్, శిఖర్ ధావన్ బ్యాటింగ్‌కు వచ్చారు. అయితే, ధావన్ డకౌట్ అయ్యాడు. మూడో ఓవర్లో ఫిలాండర్ వేసిన మూడో బంతికి ధావన్ అవుటయ్యాడు. 8 బంతులు ఆడిన ధావన్ ఒక్క పరుగూ చేయలేదు.

 1st Test: Day 2 Tea Report: Ashwin's fifer hands India narrow 17-run lead

తొలి టెస్ట్ - రెండో రోజు - సౌతాఫ్రికా బ్యాటింగ్

- ఎల్గార్ 37 పరుగులు, ఆమ్లా 43 పరుగులు, డివిల్లీయర్స్ 63 పరుగులు చేశారు. మిగతా వారు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అశ్విన్ 5 వికెట్లు, జడెజా మూడ వికెట్లు, మిశ్రా రెండు వికెట్లు తీశారు.

- భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయి 201 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా అలౌట్ అయి 184 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగుల ఆధిక్యంలో ఉంది.

- 68వ ఓవర్లో అశ్విన్ మరో వికెట్ తీశాడు. ఇమ్రాన్ తాహిర్‌ను జట్టు పరుగులు 184 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా పదో వికెట్ కోల్పోయింది.
- దూకుడుగా ఆడుతున్న డివిల్లియర్స్‌ను మిశ్రా అవుట్ చేశాడు. 67వ ఓవర్లో మూడో బంతికి డివిల్లీయర్స్ అవుటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ డివిల్లీయర్స్ వన్డేలా ఆడాడు. అతను 83 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అందులో ఆరు ఫోర్లు ఉన్నాయి.
- 66వ ఓవర్లో జడెజా స్టెయిన్ వికెట్ తీశాడు. స్టెయిన్ 14 బంతుల్లో 6 పరుగులు చేశాడు.
- 65 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
- 63వ ఓవర్లో అమిత్ మిశ్రా హార్మర్ వికెట్ తీశాడు. హార్మర్ 25 బంతుల్లో 7 పరుగులు చేసి, ఎల్బీడబ్ల్యుగా పెవిలియన్ చేరాడు.
- ఆరు వికెట్లలలో అశ్విన్ నాలుగు, జడెజా రెండు వికెట్లు తీశారు.
- ఫిలాండర్ అవుటయ్యే సమయానికి సౌతాఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
- 55వ ఓవర్లో రవీంద్ర జడెజా ఫిలాండర్ వికెట్ తీశాడు. ఫిలాండర్ 27 బంతుల్లో 3 పరుగులు చేశాడు.
- సౌతాఫ్రికా 48 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది.
- అశ్విన్ తన 46వ ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. రెండో బంతికి ఆమ్లా వికెట్, ఆరో బంతికి విలాస్ వికెట్ తీశాడు.
- ఎల్గార్ జట్టు స్కోర్ 85 వద్ద ఉన్నప్పుడు అవుటయ్యాడు. అశ్విన్ అతనిని అవుట్ చేశాడు. దక్షిణాఫ్రికా 40 ఓవర్లు ముగిసే సమయానికి 93 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.
- 28 పరుగులు, 2 వికెట్లు కోల్పోయిన అనంతరం శుక్రవారం దక్షిణాప్రికా రెండో రోజు బ్యాటింగ్‌కు దిగింది. నిలకడగా ఆడుతోంది. 33 ఓవర్లు ముగిసే సరికి 69 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది.

Story first published:  Friday, November 6, 2015, 15:10 [IST]
English summary
Off-spinner Ravichandran Ashwin's five-wicket haul trumped AB de Villiers' gritty half-century as India grabbed a narrow 17-run lead after dismissing South Africa for 184 on Day 2 of the first Test here today.
మీ వ్యాఖ్య రాయండి