Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అశ్విన్ రికార్డు: డేల్ స్టెయిన్‌కు ఈక్వల్

Posted by:
Published: Friday, November 6, 2015, 14:28 [IST]

మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. 29 ఏళ్ల అశ్విన్ టెస్టు మ్యాచుల్లో 150 వికెట్లు తీసుకున్న ఘనతను సాధించాడు. అతి వేగంగా ఆ మైలురాయిని చేరుకున్న భారత బౌలర్‌గా అతను రికార్డులకు ఎక్కాడు.

దక్షిణాప్రికా చివరి బ్యాట్స్‌మన్ ఇమ్రాన్ తాహిర్‌ను అవుట్ చేయడం ద్వారా అతను 20 టెస్టు మ్యాచుల్లో 150 వికెట్లు తీసుకున్న మైలురాయిని చేరుకున్నాడు. స్వదేశీగడ్డ మీద వంద వికెట్లు తీసుకున్న బౌలర్‌గా కూడా అతను రికార్డు సృష్టించాడు.

దక్షిణాఫ్రికాతో జరగుతున్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో అతను 51 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. దక్షిణాఫ్రికా 184 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 17 పరుగుల తొలి ఇన్నింగ్సు ఆధిక్యతను సాధించింది. అశ్విన్ 13వ సారి ఐదు వికెట్లు తీసుకున్న జాబితాలో చేరిపోయాడు.

Ashwin sets an Indian record, equals Dale Steyn in Mohali Test

అతను హ్యూ టేఫీల్డ్ (దక్షిణాఫ్రికా), ఇయాన్ బోథమ్ (ఇంగ్లాండు), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), సయీద్ అజ్మల్ (పాకిస్తాన్)ల రికార్డును సమం చేశాడు. వారంతా 29 మ్యాచుల్లో 150 వికెట్లు తీసుకున్నారు. భారత బౌలర్లలో ఇంతకు ముందు ప్రసన్న అతి వేగంగా 150 వికెట్లు తీసుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అతను 34 మ్యాచుల్లో ఆ రికార్డు సాధించాడు. ఆ రికార్డును 29 మ్యాచుల్లో 150 వికెట్లు తీసుకుని అశ్విన్ బద్దలు కొట్టాడు.

అతి వేగంగా 150 వికెట్లు తీసుకున్న ఐదుగురు టాప్ బౌలర్లు

1. సిడ్నీ బర్నేస్ (ఇంగ్లాండు), 24 మ్యాచులు
2. వకార్ యూనిస్ (పాకిస్తాన్), 27 మ్యాచులు
3. క్లారీ గ్రిమెట్ (ఆస్ట్రేలియా), 28 మ్యాచులు
4. ఆర్ అశ్విన్ (భారత్), హ్యూ టేఫీల్డ్ (దక్షిణాఫ్రికా), ఇయాన్ బోథమ్ (ఇంగ్లాండు), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), సయీద్ అజ్మల్ (పాకిస్తాన్)
5. డెన్నిస్ లిల్లీ, షేన్ వార్న్, స్టార్ట్ మాక్‌గిల్ (ముగ్గురు కూడా ఆస్ట్రేలియాకు చెందినవారు), 31 మ్యాచులు

English summary
India's number one off-spinner R Ashwin claimed a record during the 2nd day of the 1st Test against South Africa here today.
మీ వ్యాఖ్య రాయండి