Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్ నో చెప్తే పాకిస్తాన్ బోర్డ్‌కు రూ.560 కోట్ల నష్టం

Posted by:
Published: Friday, November 6, 2015, 11:35 [IST]

కరాచీ: భారత్ - పాక్ సిరీస్ లేకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) భారీ మొత్తంలో నష్టపోతుంది. భారత్ తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం పైన పాకిస్థాన్ క్రికెట్ ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉందని చెబుతున్నారు.

ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణకు భారత్ అంగీకరించకపోతే పాకిస్థాన్ వచ్చే నాలుగేళ్లలో ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో రూ.560 కోట్ల భారీ మొత్తాన్ని నష్టపోనుందని తెలుస్తోంది.

Indo Pak series: Huge loss awaits PCB if it fails to host India

తమ ఆధ్వర్యంలో వచ్చే నాలుగేళ్లలో జరిగే అన్ని సిరీస్‌లకు కలిపి రూ.955 కోట్లతో ప్రసార హక్కులు ఇవ్వడానికి పలు మీడియా సంస్థలతో పిసిబి ఒప్పందం చేసుకుంది. అయితే భారత్ వారితో ఆడకపోతే అందులో 65 శాతం, అంటే రూ.560 కోట్లు వారు నష్టపోవాల్సిందేనని తెలుస్తోంది.

English summary
The PCB will lose revenues worth approximately USD 85 million from its long-term broadcasting deal if it fails to host India for a full series over the next three to four years.
మీ వ్యాఖ్య రాయండి