Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జడేజా తిప్పేశాడు: సఫారీలపై భారత్ ఘన విజయం

Posted by:
Updated: Saturday, November 7, 2015, 16:05 [IST]

మొహాలి:స్వల్ప స్కోర్లు నమోదైన తొలి టెస్టు మ్యాచులో మరో రెండు రోజులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. రవీంద్ర జడేజా తన స్పిన్ మంత్రజాలంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ నడ్డి విరిచాడు. భారత్ 108 పరుగుల తేడాతో దక్షిణాప్రికాపై విజయం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్సులో 201 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 200 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్సులో 184 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా విజయానికి రెండో ఇన్నింగ్సులో 218 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 108 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మ్యాచులో శనివారం ఒక్క రోజే మొత్తం 18 వికెట్లు పడ్డాయి. స్పిన్‌కు మైదానం పూర్తిగా అనుకూలించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా, అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా, ఆరోన్ తలో వికెట్ తీసుకున్నారు. రెండో ఇన్నింగ్సులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లో జైల్ అత్యధిక వ్యక్తిగత పరుగులు (36) చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా అంతకు మించి పరుగులు చేయలేకపోయారు. 

Frist test, day 3: Kohli falls but Pujara builds India's lead

భారత్ తన ముందు ఉంచిన 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా తడబాటుకు గురైంది. కేవలం పది పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. హషీం ఆమ్లా సున్నా పరుగులకే జడేజా బౌలింగులో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫిలిందర్, డూప్లెసిస్ ఒక్కటేసి పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. ఫిలిందర్‌ను జడేజా అవుట్ చేయగా, డూప్లెసిస్‌ను అశ్విన్ వెనక్కి పంపించి వేశాడు. 

32 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. ఎబి డివిల్లీర్స్ కేవలం 16 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగులో అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా 45 పరుగుల స్కోర్ వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఎల్గార్ 16 పరుగులు చేసి ఆరోన్ బౌలింగులో అవుటయ్యాడు. 60 పరుగుల స్కోరు వద్ద దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. విలాస్ 6 పరుగులు చేసి జడేజా బౌలింగులో అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా 102 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్, 105 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో భారీ స్కోరు సాధించి సవాల్ విసురుతుందని భావించిన భారత్ శనివారంనాడు 200 పరుగులకే కుప్పకూలింది. శనివారం వరుసగా వికెట్లు పడుతూ వచ్చాయి. దీంతో దక్షిణాఫ్రికాకు మంచి అవకాశం లభించినప్పటికీ వాడుకోలేకపోయింది. 218 పరుగుల టార్గెట్‌ను దక్షిణాఫ్రికా ఛేదించి విజయాన్ని అందుకునే అవకాశాలుండగా టపాటపా వికెట్లు పడిపోవడంతో ఓటమి పాలైంది. 

Frist test, day 3: Kohli falls but Pujara builds India's lead

తాహిర్, హార్మర్ భారత బ్యాట్స్‌మన్‌కు శనివారం చుక్కలు చూపించారు. చెరో నాలుగు వికెట్లు తీసుకుని భారత్‌ను ఆత్మరక్షణలో పడేశారు. భారత బ్యాట్స్‌మెన్‌లో ఛటేశ్వర్ పుజారా (77) ఒక్కడే కాస్తా మెరుగ్గా ఆడాడు. మిగతావారంతా చేతులెత్తేశారు. 39 పరుగులకే భారత్ చివరి 8 వికెట్లు కోల్పోయింది.

దక్షిణాఫ్రికాతో జరుగతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత్ బ్యాటింగ్ కుప్పకూలుతోంది. 185 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జడేజా 8, అమిత్ మిశ్రా 2 పరుగులు, అశ్విన్ 3 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. భారత్ 199 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అంతకు ముందు164 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహనే కేవలం రెండు పరుగులు చేసి హార్మర్ బౌలింగులో అవుటయ్యాడు. 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో భారీ స్కోర్ సాధన లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతున్న క్రమంలో శనివారం ఉదయం వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. తొలుత భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. 161 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది.

Frist test, day 3: Kohli falls but Pujara builds India's lead

ఆ తర్వాత వెంటనే భారత్ ఛటేశ్వర్ పుజారా వికెట్‌ను కూడా కోల్పోయింది. 164 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో పుజారా 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ 29 పరుగులు చేసి జైల్ బౌలింగులో అవుట్యాడు.

125 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో పుజారా, విరాట్ కోహ్లీ శనివారం ఉదయం తమ ఇన్నింగ్సును ప్రారంభించారు. ఆ తర్వాత వెంటవెంటనే వారు అవుటయ్యారు.

Story first published:  Saturday, November 7, 2015, 10:54 [IST]
English summary
India lost two wickets early in saturday morning in first test of second innings against south africa. Virat Kohli and Chateswar Pujara out.
మీ వ్యాఖ్య రాయండి