Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

'డిసెంబర్ 8న ఐపీఎల్‌ కొత్త జట్లు ప్రకటిస్తాం'

Posted by:
Published: Monday, November 9, 2015, 13:53 [IST]

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ల స్ధానంలో కొత్త ప్రాంఛైజీలను బీసీసీఐ ప్రకటించనుంది.ఐపీఎల్‌లోకి కొత్తగా రాబోయే రెండు ప్రాంఛైజీలను డిసెంబర్ 8న ప్రకటించనున్నారు.

నవంబర్ 15న కొత్త ఫ్రాంచైజీల బిడ్డింగ్ ప్రక్రియ మొదలవుతుందని, డిసెంబర్ 4వ తేదీ లోపు ఆసక్తి ఉన్న సంస్ధలు సంప్రదించవచ్చని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. డిసెంబర్ 8న ప్రాంఛైజీల్ని ప్రకటిస్తామన్నారు.

IPL to get 2 new teams on December 8

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌ వ్యవహారంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ జట్లు అవినీతికి పాల్పడట్టు ఆధారాలున్నాయని జస్టిస్ లోథా కమిటీ ఆయా జట్లపై రెండేళ్ల పాటు వేటు విధించిన సంగతి తెలిసిందే.

అంతేకాదు స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మేయప్పన్, రాజ్‌కుంద్రాను జస్టిస్ లోధా కమిటీ దోషులుగా తేల్చింది. క్రికెట్ కార్యకలాపాల నుంచి వీరిద్దరిపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.

English summary
BCCI Working Committee had decided to replace CSK and RR following the interim report of the Supreme Court-appointed Justice Lodha Committee on the spot fixing and betting scandal in the IPL 2013.
మీ వ్యాఖ్య రాయండి