Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రికార్డ్: 10వేల పరుగుల తొలి ఆటగాడిగా జాఫర్

Published: Monday, November 9, 2015, 12:59 [IST]

కోల్‌కతా: భారత మాజీ ఓపెనర్‌, విదర్భ రంజీ ఆటగాడు వసీం జాఫర్‌(37) రంజీ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 81 సంవత్సరాల రంజీ చరిత్రలో 10 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.

బెంగాల్‌తో సాల్ట్‌లేక్‌ స్టేడియంలో జరుగుతున్న గ్రూప్‌-ఎ రంజీ మ్యాచకు రెండోరోజైన ఆదివారం బ్యాటింగ్‌కు దిగిన జాఫర్‌.. బెంగాల్‌ బౌలర్‌ వీర ప్రతాప్‌ బౌలింగ్‌లో ఎనిమిదో పరుగు చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే 9 పరుగుల వద్ద ప్రజ్ఞాన ఓఝా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

కాగా, 10 వేల పరుగుల ఈ ఫీట్‌ను తన కుటుంబానికి అంకితమిస్తున్నట్టు జాఫర్‌ తెలిపాడు. ‘నా కెరీర్‌లో ఇదెంతో గొప్ప విషయం. ఆ మాటకొస్తే... పరుగులు చేసుకుంటూ పోవడం గొప్పేం కాదు. రోజురోజుకూ మన ఆట ఎంత మెరుగవుతున్నదన్నదే ముఖ్యం. నా కెరీర్‌ ముగింపు దశకు వచ్చిందని తెలుసు. అయితే ఏ స్థితిలోనైనా జట్టుకు మెరుగైన ఫలితం అందేలా చూడడమే నా పని' అన్నాడు.

ఓవరాల్‌గా చూస్తే జాఫర్‌ 229 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచల్లో 51 శతకాలు, 83 అర్ధశతకాలతో 17,088 పరుగులు చేశాడు. చాలా ఏళ్లపాటు ముంబైకి ఆడిన జాఫర్‌ ఈ సీజననుంచే విదర్భ తరపున బరిలోకి దిగాడు.

 Ranji Trophy: Wasim Jaffer becomes first batsman to cross 10,000-run mark

1996-97లో కెరీర్‌ ప్రారంభించిన జాఫర్‌ ఇప్పటివరకూ 126 రంజీ మ్యాచలాడాడు. రంజీల్లో 10,002, దులీప్‌ ట్రోఫీలో 2,545, ఇరానీ ట్రోఫీలో 1,008 పరుగులతో మూడింటిలోనూ అత్యధిక పరు గులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు జాఫర్. రంజీల్లో జాఫర్‌ తర్వాత అమోల్‌ మజుందార్‌ (9202), మిథున మన్హాస్‌ (8197) ఉన్నారు.

కాగా, జాఫర్‌ రికార్డును మినహాయిస్తే ఈ మ్యాచలో విదర్భకు కలిసి వచ్చిన అంశమేమి లేదు. మ్యాచుకు రెండోరోజైన ఆదివారం ఆటచివరికి తొలి ఇన్నింగ్స్‌లో 141 పరుగులకే 7 వికెట్లు కోల్పో యి కష్టాల్లో పడింది. ప్రజ్ఞాన ఓఝా ఐదు వికెట్లు తీశాడు. అంతకుముందు బెంగాల్‌ 334 పరుగులు చేసింది.

English summary
Vidarbha opener Wasim Jaffer on Sunday became the first cricketer in Ranji Trophy history to notch up 10,000 runs on day two of their Group A match against Bengal at the Jadavpur University second campus ground in Salt Lake.
మీ వ్యాఖ్య రాయండి