Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బిజినెస్‌మెన్: ఐపీఎల్ జట్టును కొనేందుకు ధోనీ ఆసక్తి!

Posted by:
Published: Tuesday, November 10, 2015, 14:36 [IST]

బెంగళూరు: కొత్తగా వేలం వేయనున్న రెండు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీల్లో ఒకదానిని కొనుగోలు చూసేందుకు భారత టెస్ట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా వ్యాపారవేత్త సంజీవ్‌ గోయెంకాతో కలిసి ఒక ఐపీఎల్‌ జట్టును కొనడానికి ధోని యోచిస్తున్నట్లు.. ఈ విషయంపై ఇప్పటికే బీసీసీఐకి సమాచారమిచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ నెల 15న రెండు కొత్త ఫ్రాంఛైజీలకు బిడ్డింగ్‌ ప్రక్రియ ఆరంభం కానుంది.

 MS Dhoni to own an IPL team?

డిసెంబరు 8న ఫ్రాంఛైజీలను ప్రకటిస్తారు. ఐతే ధోని ఆటగాడిగా ఉంటూ ఐపీఎల్‌ జట్టు కొంటే విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వస్తుంది కాబట్టి బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలని అంటున్నారు. ప్రస్తుతం గోయెంగా... ఇండియన్ సూపర్ లీగ్‌లోని అట్లెంటికో ది కోల్‌కతా జట్టుకు సహయజమాని.

English summary
Mahendra Singh Dhoni, Sanjeev Goenka Keen on Buying Indian Premier League Teams.
మీ వ్యాఖ్య రాయండి