Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అలా రాసివ్వండి: బిసిసిఐకి షాహిద్ అప్రీది డిమాండ్

Posted by:
Published: Thursday, November 12, 2015, 15:06 [IST]

కరాచీ: భారత్ - పాకిస్తాన్ సిరీస్ పైన పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రీది స్పందించాడు. పాక్‌తో సిరీస్ నిర్వహించాలనేది తమ అభిమతమని బిసిసిఐ పేర్కొంది. దీనిపై అఫ్రీది స్పందించాడు. భారత్ వెళ్లి క్రికెట్ ఆడటానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.

అయితే, బీసీసీఐ ఏదైతే చెబుతుందో దానికి సంబంధించి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ కూడా వెల్లడించారు. అఫ్రిది మాట్లాడుతూ... షహర్యాన్ ఖాన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పాడు.

 Shahid Afridi demands written guarantee from India

2012-13లో తాము భారత్‌లో సిరీస్ ఆడినప్పుడు బీసీసీఐకి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరిందని, పీసీబీకి ఏమీ రాలేదన్నాడు. ఇప్పుడు భారత్‌లో పాక్ క్రికెట్ ఆడితే పీసీబీకి ఎంత రెవెన్యూను ఇస్తారనే విషయాన్ని బీసీసీఐ లిఖితపూర్వకంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.

కాగా, భారత్-పాక్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్‌కు అనుమతించే విషయాన్ని పరిశీలించాలని బిసిసిఐ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తే, ఈ ఏడాడి డిసెంబర్ 15 నుంచి ఇరు దేశాల జట్ల మధ్య క్రికెట్ సిరీస్ మొదలు కానుంది. డిసెంబర్ 15న మొదలు కానున్న ఈ సిరీస్ జనవరి 7 దాకా కొనసాగనుంది. ఇందులో ఐదు వన్డేలతో పాటు రెండు టీ20 మ్యాచ్ లు కూడా ఉండే అవకాశముంది.

English summary
Veteran all-rounder Shahid Afridi believes Pakistan can go to India and play a series but only after the PCB gets written guarantees from its BCCI.
మీ వ్యాఖ్య రాయండి