Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

పాకిస్తాన్లో ఆడమని షోయబ్ అక్తర్ విజ్ఞప్తి, సచిన్ ఓకే!

Posted by:
Published: Thursday, November 12, 2015, 11:46 [IST]

హోస్టన్: పాకిస్తాన్‌లో భారత జట్టు క్రికెట్ ఆడే విషయంలో బిసిసిఐ సమాలోచనలు జరుపుతోంది. అయితే, పొరుగు దేశంలో మ్యాచ్ ఆడేందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మాత్రం సై అంటున్నాడట!

తమ దేశంలో (పాకిస్తాన్) ఆల్ స్టార్ టి 20 మ్యాచ్‌ను నిర్వహించాలని షోయబ్ అక్తర్.. సచిన్‌ను కోరాడు. తన ప్రతిపాదనకు సచిన్ సంతోషంగా అంగీకరించాడని, ఇది కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నిస్తానని షోయబ్ అక్తర్ చెప్పాడు.

మాజీ క్రికెటర్లతో సచిన్, షేన్ వార్న్ ఆల్ స్టార్ టి20 నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ న్యూయార్క్, రెండో మ్యాచ్ గురువారం నాడు హోస్టన్‌లో జరిగింది. అక్తర్‌తో పాటు పాక్ ఆటగాళ్లు వసీం అక్రమ్, సక్లెయిన్ ముస్తక్, మోయిన్ ఖాన్ ఆల్ స్టార్ సిరీస్‌లో ఆడుతున్నారు.

Shoaib Akhtar requests Sachin Tendulkar to stage All-Stars event in Pakistan

భారత క్రికెటర్లు సెహ్వాగ్, లక్ష్మణ్, గంగూలీ, అజిత్ అగార్కర్‌‍లు ఆడుతున్నారు. ఈ సమయంలో సచిన్ ఎదుట షోయబ్ అక్తర్ తన ప్రతిపాదన ఉంచగా.. సచిన్ సుముఖంగా ఉన్నాడని అక్తర్ చెప్పారు.

ఇదిలా ఉండగా, అమెరికాలోని హూస్టన్‌ వేదికగా జరిగిన క్రికెట్‌ ఆల్‌ స్టార్స్‌ రెండో టీ20 మ్యాచ్‌లో వార్న్‌ వారియర్స్‌ చేతిలో సచిన్‌ బ్లాస్టర్స్‌ జట్టు 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సచిన్‌ బ్లాస్టర్స్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో షేన్‌వార్న్‌ నేతృత్వంలోని వార్న్‌ వారియర్స్‌ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్‌ లాస్‌ ఏంజెల్స్‌లో నవంబరు 14న జరగనుంది.

English summary
Former speedster Shoaib Akhtar has requested Indian batting legend Sachin Tendulkar to hold the All-Stars Cricket event in Pakistan as well.
మీ వ్యాఖ్య రాయండి