Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

యూనిస్ అకస్మాత్తు రిటైర్మెంట్: పిసిబి ఫైర్

Posted by:
Published: Thursday, November 12, 2015, 8:38 [IST]

యూనిస్ అకస్మాత్తు రిటైర్మెంట్: పిసిబి ఫైర్
 

మొత్తంగా 264 వన్డేలు ఆడిన ఈ సీనియర్ ఆటగాడు 7240 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు, 48 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 144 పరుగులు చేశాడు. వన్డేల్లో పెద్దగా పేరు సంపాదించలేకపోయిన యూనిస్‌ఖాన్ టెస్టుల్లో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2009లో ఇతడి సారధ్యంలోనే పాకిస్థాన్ టీ-ట్వంటీ ప్రపంచకప్‌ను నెగ్గింది.

జట్టు మేనేజ్‌మెంట్‌తో అసంతృప్తి కారణంగానే యూనిస్ ఖాన్ వన్డే నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. వన్డే నుంచి తప్పుకోవాలని 2011 నుంచి యూనిస్ ఖాన్ ఆలోచన చేస్తున్నట్లు ఓ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. కొందరు తన నవ్వును ఇష్టపడరని, కొందరు తన టెక్నిక్‌ను ఇష్టపడరని యూనిస్ ఖాన్ వ్యాఖ్యానించాడు.

వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు యూనిస్ ఖాన్ చేసిన ప్రకటనను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షాహర్యార్ ఖాన్ తప్పు పట్టారు. యూనిస్ ఖాన్ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయంపైనే కాకుండా తీసుకున్న నిర్ణయం సందర్భం కూడా తనకు అసంతృప్తిని కలిగించిందని ఆయన అన్నారు.

English summary
Former Pakistan captain Younis Khan’s sudden announcement of retirement from ODI cricket on Wednesday fuelled speculation that he was not happy with the team management.
మీ వ్యాఖ్య రాయండి