Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బెంగుళూరులో 2వ టెస్టు: డేల్ స్టెయిన్ దూరం

Posted by:
Published: Friday, November 13, 2015, 14:58 [IST]

బెంగుళూరు: ఫ్రీడమ్ సిరిస్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్నరెండో టెస్టుకి పేసర్ డేల్ స్టెయిన్ దూరమయ్యాడు. చీలమండల గాయం కారణంగా భారత్‌తో ఆడనున్న రెండో టెస్టుకు అతను దూరమయ్యాడు.

చీలమండల గాయం కారణంగా మొహాలీలో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డేల్ స్టెయిన్ బౌలింగ్‌కు దూరమయ్యాడు. రెండో టెస్టు మ్యాచ్ కోసం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో విఫలమయ్యాడు.

ఏబీ డెవిలియర్స్ 100వ టెస్టు మ్యాచ్‌లో డేల్ స్టెయిన్ లేకుండానే బరిలోకి దిగుతున్నట్లు టెస్టు కెప్టెన్ హషీం ఆమ్లా శుక్రవారం (నవంబర్ 13)న పేర్కొన్నారు. రెండు రోజుల్లో గాయలబారిన పడ్డ రెండో దక్షిణాఫ్రికా ఆటగాడు.

 Dale Steyn ruled out of 2nd Test against India in Bengaluru

నవంబర్ 12 (గురువారం) జరిగిన దక్షిణాఫ్రికా ట్రైనింగ్ సెషన్‌లో ఫిన్‌లాండర్ మోకాలి గాయం కారణంగా సిరిస్ నుంచే తప్పుకున్న సంగతి తెలిసిందే. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్ 1-0తేడాతో ముందంజలో ఉంది.

మొహాలీలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 108 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో టెస్టు బెంగుళూరులో నవంబర్ 14(శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది.

English summary
In a massive blow to South Africa, fast bowler Dale Steyn has been ruled out of the 2nd Test against India, due to a groin injury.
మీ వ్యాఖ్య రాయండి