Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మంచోడ్ని కాదు: కోహ్లీతో తగ్గనన్న డివిలియర్స్

Published: Friday, November 13, 2015, 13:02 [IST]

బెంగళూరు: ఎంతో సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబి డివిలియర్స్.. తాను మైదానంలో మాత్రం అంత మంచోడ్ని కాదని అంటున్నాడు. అవసరమైతే నోటికి పని చెప్పి ప్రత్యర్థులను బెదరగొట్టేందుకు వెనుకాడనంటూ హెచ్చరిస్తున్నాడు. నవంబర్ 14న ప్రారంభం కానున్న 2వ టెస్ట్ లో ఆడనున్న డివిలియర్స్.. తన 100వ టెస్టును పూర్తి చేయనున్నాడు.

ఈ సందర్భంగా డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘మైదానంలో నేనేమీ మంచోడిని కాదు. నాకు విజయాలు కావాలి. క్రికెట్లో మేం మ్యాచ్‌లు గెలవడం కోసం నేనేదైనా చేస్తా. స్లెడ్జింగ్‌ చేయాల్సి వస్తే అందుకు నేను సిద్ధమే' అని తేల్చి చెప్పాడు.

అంతేగాక, ‘అవసరమైతే ప్రత్యర్థులను మాటలతో బెదరగొట్టడానికి ప్రయత్నిస్తా. విరాట్‌ కోహ్లీ టెక్నిక్‌, అతడిలోని చిన్న చిన్న లోపాలను ఎత్తిచూపుతూ అతడి ఏకాగ్రత దెబ్బతీయడానికి ప్రయత్నిస్తా. అలాంటివి చేయడానికి నేను వెనుకాడను. గెలవడం ముఖ్యం. మైదానంలో మంచివాడిగా ఉన్న ఆటగాణ్ని నేనెప్పడూ గౌరవించలేదు. ప్రత్యర్థులు తమ జట్టును గెలిపించుకోవడం కోసం చాలా కఠినంగా ఉండాలని కోరుకుంటా' అని పేర్కొన్నాడు.

I'm not a nice guy on field, can intimidate Virat Kohli: De Villiers

మైదానం వెలుపల మంచి మనిషిలా ఉండేందుకు ప్రయత్నిస్తానని, దానితో క్రికెట్‌కు సంబంధం లేదని డివిలియర్స్ తెలిపాడు. తాను పెరిగే క్రమంలో చాలా ఆటలు ఆడినట్లు వెల్లడించాడు. క్రికెటర్‌గా ఈ రోజు తాను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం అవేనని చెప్పాడు.

‘మా కుటుంబంలో అంతా క్రీడా ప్రేమికులే. నేను ఏది ఆడినా మా అమ్మా నాన్న ఎప్పుడూ అభ్యంతరపెట్టలేదు. నేను వైద్యుణ్ని అయ్యుంటేనో లేదా డిగ్రీ అందుకుని ఉంటేనో మా నాన్న సంతోషించేవాడు. కానీ, క్రికెట్లో నేను సాధించినదానిపట్ల కూడా సంతోషగానే ఉన్నాడు' అని డివిలియర్స్ తెలిపాడు.

వందో టెస్టు ఆడబోతున్నానన్న ఒత్తిడి తనపై లేదని చెప్పాడు. కానీ 0-1తో వెనుకబడ్డందుకు మాత్రం ఒత్తిడి ఉందని, 100వ టెస్టు ఆడడం గొప్ప గౌరవమని చెప్పాడు. ఈ స్థితిలో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పాడు.

English summary
Dismissing popular perception, AB de Villiers today said he is not a nice guy on the field and, if required, can go to any extent in sledging and get someone like "Virat Kohli off his game by talking about the little flaws" in his batting.
మీ వ్యాఖ్య రాయండి