Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

'కృష్ణం వందేజగద్గురుం' పాటలో మెరిసిన యువీ లవర్

Posted by:
Published: Friday, November 13, 2015, 15:34 [IST]

ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, బ్రిటిష్ మోడల్, నటి హాజెల్ కీచ్‌ల నిశ్చితార్ధం జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇండోనేషియాలోని బాలీ దీవుల్లో దీపావళి పండుగ రోజు సన్నిహితుల మధ్య వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందని అంటున్నారు.

యువీని పెళ్లాడబోతున్న నటి హాజెల్ బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో మెరిసింది. సల్మాన్ ఖాన్‌ హీరోగా నటించిన బాడీగార్డ్‌ చిత్రంలో హేజెల్‌ ఓ కీలకపాత్రలో నటించింది. తెలుగులో 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రంలోనూ ఓ పాటలో మెరిసింది.

 Yuvraj Singh gets hitched to Hazel Keech, wedding next year

కాగా, గత మూడేళ్లుగా యువీ, హేజెల్‌ల మధ్య పరిచయం ఉందని చెబుతున్నారు. ప్రేమలో పడ్డారు. దీపావళి నాడు మెడలో పూలమాలలతో ఈ జంట ఓ రెస్టారెంట్లో విందు చేసుకున్న చిత్రాలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. తన వేలికున్న ఉంగరాన్ని హాజెల్ మురిపెంగా చూపిస్తూ ఫోటోలు కూడా దిగింది. ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందని యువీ సన్నిహితులు చెబుతున్నారు. హాజెల్ వయస్సు 28 ఏళ్లు.

English summary
Yuvraj Singh gets hitched to Hazel Keech, wedding next year.
మీ వ్యాఖ్య రాయండి