Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

2వ టెస్ట్: దక్షిణాఫ్రికా స్కోర్ 214, ఇండియా 80/0

Updated: Saturday, November 14, 2015, 17:42 [IST]

బెంగళూరు: దక్షిణాఫ్రికాపై జరుగుతున్న రెండో మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 45 పరుగులతో, మురళీ విజయ్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భాగంగా శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మొదలైన రెండో టెస్ట్ మ్యాచులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆట ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ సఫారీ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు.

భారత స్పిన్నర్ అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు షాకిచ్చాడు. గళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది.

 2nd Test: India win toss, opt to bowl; Ishant, Binny included

అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సౌతాఫ్రికా ఓపెనర్ వాన్ జెల్(10) వికెట్ల ముందు దొరికిపోయాడు. అశ్విన్ ఇదే ఓవర్లో డుప్లెసిస్ (0)ను పెవిలియన్ బాట పట్టించాడు. అనంతరం హషీం ఆమ్లా 7 పరుగులు చేసిన తర్వాత వరుణ్ అరోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

కాగా, నాలుగో వికెట్‌గా ఎల్గర్ 38 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత డుమిని 15 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 

ఆ తర్వాత 15 పరుగులు చేసిన డుమిని అశ్విన్ బౌలింగ్‌లో, విలాస్(15) జడేజా బౌలింగ్‌లో ఔటయ్యారు. 85 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచిన డివిలియర్స్ కూడా జడేజా బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఆ తర్వాత రబడ(0), మోర్కెల్ 22, అబ్బోట్ 14 పరుగులకు ఔటయ్యారు. దీంతో 59 ఓవర్లలో 214 పరుగులు చేసి ఆలౌటైంది. కాగా, అశ్విన్ 4 వికెట్లు, జడేజా 4, అరోన్ 1 వికెట్ తీశారు.

భారత్ తొలి ఇన్నింగ్స్

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లుగా మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లు వచ్చారు. ప్రస్తుతం విజయ్ 22, ధావన్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. 20 ఓవర్లకు 73 పరుగులతో భారత్ ఆటను కొనసాగిస్తోంది.

Story first published:  Saturday, November 14, 2015, 11:27 [IST]
English summary
Ishant Sharma and Stuart Binny were included as India captain Virat Kohli won the toss and opted to bowl first against South Africa in the 2nd Test here at M Chinnaswamy Stadium on Saturday.
మీ వ్యాఖ్య రాయండి