Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బిసిసిఐ ఫోన్: షహర్యార్, భారత్‌లో ఆడితేనే: అనురాగ్

Posted by:
Published: Sunday, November 15, 2015, 14:29 [IST]

కరాచీ: భారత్‌లో ఇండో పాక్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టును బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ ఆహ్వానించాడని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ షహర్యార్‌ ఖాన్‌ శనివారం ప్రకటించాడు. ఇది ఆసక్తికర చర్చకు దారి తీసింది.

అయితే భారత్‌తో జరగాల్సిన సిరీస్‌కు తామే ఆతిథ్యమివ్వాల్సి ఉందని, మరి భారత్‌కు వెళ్లి ఎలా సిరీస్‌ ఆడతామని పీసీబీ (పాక్ క్రికెట్ బోర్డు) ప్రశ్నిస్తుండగా, ఆతిథ్య హక్కులు ఎవరివైనా మ్యాచ్‌లు భారత్‌లో జరగడానికి అంగీకరిస్తేనే సిరీస్‌కు మార్గం సుగమం అవుతుందని బీసీసీఐ చెబుతోంది.

BCCI invites Pakistan to play bilateral series in India: Shaharyar Khan

తమతో సిరీస్‌ కోసం బీసీసీఐ అధ్యక్షుడు ఫోన్లో ప్రతిపాదన చేశాడని, తమకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందన్నాడని, ఐతే సిరీస్‌లో భారత్‌లోనే జరగాలన్నాడని, భద్రత ఏర్పాట్లకు ఢోకా ఉండదని చెప్పాడని, కానీ మేం ఆతిథ్యమివ్వాల్సిన సిరీస్‌ను భారత్‌లో ఎలా ఆడతామని షహర్యార్‌ ఖాన్ అన్నాడు.

ఐతే ఈ వ్యాఖ్యల్ని మనోహర్‌ ఖండించాడు. షహర్యార్‌తో మాట్లాడటం వాస్తవమేనని, ఐతే తాము ఇంకా ప్రభుత్వంతో సంప్రదింపులే జరపలేదని వివరణ ఇచ్చాడు. షహర్యార్‌ ఖాన్‌ ప్రకటనపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ.. భారత్‌లో ఆడటానికి వారు అంగీకరిస్తేనే చర్చలు జరుగుతాయని, పాకిస్థాన్‌లో కానీ, తటస్థ వేదికలో కానీ ఆడేందుకు ప్రభుత్వం అంగీకరించదన్నాడు.

English summary
The BCCI has officially invited Pakistan to play its 'home' series in India in December, PCB chairman Shaharyar Khan said on Saturday.
మీ వ్యాఖ్య రాయండి