Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఒక్క బంతి పడకుండానే రెండో రోజు ఆట రద్దు

Posted by:
Updated: Sunday, November 15, 2015, 14:53 [IST]

బెంగుళూరు: ఫ్రీడమ్ సిరిస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో రెండో రోజు ఆట నిర్వహించడానికి సాధ్యపడలేదు. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో మ్యాచ్ నిర్వహణకు అడ్డంకిగా మారింది.

దీంతో రెండో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

తొలిరోజు ఆట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మ్యాచ్ ప్రారంభం కావాల్సిన సమయం నుంచే వర్షం పడుతుండటంతో, రెండో రోజు ఇన్నింగ్స్ ఇంకా మొదలు కాలేదు. వర్షం ఆగినా ఆట ప్రారంభం కావాలంటే మధ్యాహ్నం సెషన్ వరకు ఆగాల్సిందేనంటూ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ స్కోరు కార్డు

ఇక, తొలి రోజు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, దక్షిణాఫ్రికాను 214 పరుగులకే ఆలౌట్ చేసింది. 59 ఓవర్లలో 214 పరుగులు చేసి ఆలౌటైంది. కాగా, అశ్విన్ 4 వికెట్లు, జడేజా 4, అరోన్ 1 వికెట్ తీశారు.

India vs South Africa Bangalore Test Day 2: Lunch Taken as Rain Washes Out First Session

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లు నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ (73), శిఖర్ ధావన్ (62) పరుగులతో ఉన్నారు.

Story first published:  Sunday, November 15, 2015, 13:30 [IST]
English summary
It was the same old story on day one of the second Test between India and South Africa in Bangalore. They were blown away by the spin duo of Ravichandran Ashwin and Ravindra Jadeja. Eight out of the 10 wickets went to the spinners and barring AB de Villiers, who scored a majestic 85 in his 100th Test.
మీ వ్యాఖ్య రాయండి