Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

2వ టెస్ట్: వర్షం అడ్డంకి, మూడో రోజు ఆట రద్దు

Posted by:
Updated: Monday, November 16, 2015, 12:45 [IST]

హైదరాబాద్: బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరగుతున్న రెండో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగా మూడో రోజైన సోమవారం కూడా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో సోమవారం కూడా ఆట ప్రారంభమయ్యే అవకాశం కూడా లేకపోవడంతో అంఫైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

తొలిరోజు ఆట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ క్రమంలో వరుసగా ఆదివారం కూడా మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. ఆటకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మంగళవారం కూడా ఆటకు వాతావరణం అనుకూలిస్తుందనే ఆశలు లేవు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

2nd Test: Day 3 also washed out in Bengaluru

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. ఇక, తొలి రోజు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, దక్షిణాఫ్రికాను 214 పరుగులకే ఆలౌట్ చేసింది. 59 ఓవర్లలో 214 పరుగులు చేసి ఆలౌటైంది. కాగా, అశ్విన్ 4 వికెట్లు, జడేజా 4, అరోన్ 1 వికెట్ తీశారు.

భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ స్కోరు కార్డు

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లు నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ (73), శిఖర్ ధావన్ (62) పరుగులతో ఉన్నారు.

Story first published:  Monday, November 16, 2015, 12:44 [IST]
English summary
Replying to South Africa's 214 all out, India had ended the opening day at 80 for no loss and Day 2 was washed off due to consistent rains. The M Chinnaswamy stadium has witnessed just 81 overs of play on the opening day.
మీ వ్యాఖ్య రాయండి