Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

160.4 కిమీ: స్టార్క్ బంతి బుల్లెట్: టేలర్ డబుల్ రికార్డ్

Posted by:
Published: Monday, November 16, 2015, 10:11 [IST]

పెర్త్: ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ రికార్డ్ సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పెర్త్‌ వేదికగా న్యూజిలాండ్ - ఆస్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు అతడు అరుదైన ఘనత సాధించాడు.

ఆదివారం న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లోని 21వ ఓవర్లో నాలుగో బంతిని స్టార్క్‌ ఏకంగా 160.4 కిమీ వేగంతో విసిరాడు. ఈ యార్కర్‌ను రాస్‌ టేలర్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన బంతి ఇదే. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకూ ఐదుగురు మాత్రమే గంటకు 160 కిమీ మైలురాయిని దాటారు.

పాకిస్థాన్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ (161.3), ఆస్ట్రేలియా పేసర్లు షాన్‌ టైట్‌ (161.1), బ్రెట్ లీ (161.1), జెఫ్‌ థామ్సన్‌ (160.6) ఈ జాబితాలో ఉన్నారు.

Mitchell Starc's 160km/h bowl: Accuracy of speed gun technology questioned

టేలర్ డబుల్

న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ డబుల్ సెంచరీ చేశాడు. ఓవర్ నైట్‌ స్కోరు 140/2తో మూడో రోజు, ఆదివారం బ్యాటింగ్‌ కొనసాగించిన న్యూజిలాండ్ జట్టు ఆఖరుకు 510/6తో నిలిచింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో వార్నర్‌ డబుల్‌ సెంచరీ చేస్తే కివీస్‌ జట్టులో రాస్‌ టేలర్‌ (235 బ్యాటింగ్‌; 308 బంతుల్లో 34X4) దీటైన ద్విశతకం బాదాడు.

భీకర ఫామ్‌ కొనసాగిస్తూ విలియమ్సన్‌ (166; 250 బంతుల్లో 24X4) మరో సెంచరీ కొట్టాడు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 265 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆస్ట్రేలియాపై ఏ వికెట్‌కైనా కివీస్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఆస్ట్రేలియాపై తొలి డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా టేలర్‌ రికార్డు నెలకొల్పాడు.

ఓ దశలో 352/2తో తిరుగులేని స్థితిలో నిలిచిన కివీస్‌.. విలియమ్సన్, మెక్‌కలమ్ (27), వాట్లింగ్ (1), బ్రాస్‌వెల్‌ (12) వికెట్లను తక్కువ వ్యవధిలో కోల్పోయింది. ఐతే టేలర్‌ నాటౌట్‌గా నిలవడంతో నాలుగో రోజు కివీస్‌.. ఆసీస్‌ స్కోరును దాటే అవకాశముంది. ఆ జట్టు ఇంకా 49 పరుగులే వెనుకబడి ఉంది. తొలుత ఆసిస్ 9 వికెట్లు కోల్పోయి 559 పరుగులు చేసింది.

English summary
The accuracy of cricket's speed gun technology has come under question once more after Australian paceman Mitchell Starc sent down the fastest ball in test history at the WACA yesterday.
మీ వ్యాఖ్య రాయండి