Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఒప్పుకున్న యువీ, పెళ్లి చేసుకుంటున్నా: హేజెల్

Posted by:
Published: Monday, November 16, 2015, 9:31 [IST]

ఢిల్లీ: నటి, మోడల్ హేజెల్‌ కీచ్‌తో తన నిశ్చితార్థం విషయమై వచ్చిన వార్తలు గురించి భారత్ స్టార్ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. తనకు హేజెల్‌తో నిశ్చితార్థం అయినట్లు అంగీకరించాడు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

'అవును.. నాకు హేజెల్‌తో నిశ్చితార్థమైంది. ఎందుకంటే ఆమె రూపంలో నాకు జీవితాంతం తోడుండే నేస్తం దొరికింది'' అంటూ ట్విటర్‌లో ప్రకటించాడు. ఎంగెజ్మెంట్ అయిన మూడు రోజుల తర్వాత యువరాజ్ దానిని ఒప్పేసుకున్నాడు.

 Yuvraj Singh says he is engaged to his 'friend for life' Hazel Keech

అదే సమయంలో, తాను ఇప్పుడు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వనని, అలాగే నిశ్చితార్థం పైన ఇప్పుడే ఎక్కువ మాట్లాడనని చెప్పాడు. ప్రస్తుతం తాను ముఖ్యమైన సిరీస్ ఆడుతున్నానని, దాని పైన తాను దృష్టి సారించవలసి ఉందని ట్వీట్ చేశాడు.

మరోవైపు, హాజెల్ కీచ్ కూడా ట్వీట్ చేశారు. 'అవును. ఇది నిజం. నేను యువరాజ్ సింగ్‌ను పెళ్లి చేసుకుంటున్నాను. అలాంటి వ్యక్తి తనకు దొరికినందుకు సంతోషంగా ఉందని ఆదివారం నాడు సాయంత్రం ట్వీట్ చేశారు.

English summary
Three days after news came of Yuvraj Singh getting engaged to British-born actress Hazel Keech in Bali, the star cricketer officially accepted that the news was true, for the first time, on Sunday.
మీ వ్యాఖ్య రాయండి