Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అంతర్జాతీయ క్రికెట్‌కు మిచెల్ జాన్సన్ గుడ్‌బై

Updated: Tuesday, November 17, 2015, 11:56 [IST]

పెర్త్: అంతర్జాతీయ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. పెర్త్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ అతనికి చివరిది. ఆస్ట్రేలియా ప్లేయర్లలో అత్యధిక వికెట్లు తీసుకున్న నాలుగో బౌలర్‌గా జాన్సన్ నిలిచాడు.

పెర్త్ టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు జాన్సన్ తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. 73 టెస్టులు ఆడిన 34 ఏళ్ల జాన్సన్ మొత్తం 311 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో అత్యధిక టెస్టు వికెట్లు తీసుకున్న వారిలో షేన్ వార్న్ (708), గ్లెన్ మెక్‌గ్రాత్(563), డెన్నిస్ లిల్లీ (355) ఉన్నారు.

Australia fast bowler Mitchell Johnson retires from international cricket

2007లో ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో జాన్సన్ చోటు సంపాదించాడు. 2008లో సౌతాఫ్రికాపై 61 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. 153 వన్డేల్లో 239 వికెట్లు తీసుకున్నాడు. మొత్తం 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

జాన్సన్ చాలా ప్రత్యేకమైన బౌలర్ అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. రిటైర్మెంట్ తర్వాత జీవితం బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

{tweet2}

కాగా, షేన్ వాట్సన్ ట్విట్టర్‌లో జాన్సన్ రిటైర్మెంట్‌‌‍పై స్పందిస్తూ. ఇక ఓ గొప్ప సహచరుడితో ఆడే అవకాశం తనకు లేకుండా పోతోందని పేర్కొన్నాడు. జాన్సన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలియగానే తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పాడు.

Story first published:  Tuesday, November 17, 2015, 11:39 [IST]
English summary
Mitchell Johnson has called time on his international career, with the fast bowler announcing his intention to retire at the conclusion of the current second Test match against New Zealand in Perth.
మీ వ్యాఖ్య రాయండి