Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బురద తొలగించాక, జల్లులు: నాలుగో రోజు ఆట రద్దు

Posted by:
Published: Tuesday, November 17, 2015, 15:45 [IST]

బెంగళూరు: బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరగుతున్న రెండో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగా నాలుగో రోజైన మంగళవారం కూడా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది.

కుండపోతగా కురుస్తున్న వర్షంతో సోమవారం కూడా ఆట ప్రారంభమయ్యే అవకాశం కూడా లేకపోవడంతో అంఫైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆదివారం, సోమవారం, మంగళవారం.. ఇలా వరుసగా మూడు రోజుల పాటు మ్యాచ్ రద్దయింది.

Day 4: Another full day lost due to rain in 2nd Test in Bengaluru

రెండో టెస్ట్ మ్యాచ్‌లో మధ్యాహ్నం సమయానికి బెంగళూరు స్టేడియంలో చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. అంతకుముందు రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మైదానంలోని ఔట్ ఫీల్డ్ అంతా బురదగా మారింది. ఉదయం నుంచి స్టేడియం సిబ్బంది నిరంతరంగా శ్రమించి మ్యాచ్ ఆడేందుకు వీలుగా మైదానం తయారు చేశారు.

మొదట ఉదయం పది గంటలకు, పదకొండున్నర గంటలకు అంపైర్లు పిచ్, ఔట్ ఫీల్డును పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం ఒకటి గంటలకు పరిశీలించారు. రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 45 ఓవర్లు ఆడేందుకు అంపైర్లు అనుమతించిన స్వల్ప వ్యవధిలోనే జల్లులు కురిశాయి.

English summary
Another full day's play was lost due to rain in the 2nd Test between India and South Africa here today. Like the previous 2 days, the 4th day also was called off without a ball being bowled.
మీ వ్యాఖ్య రాయండి