Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నీకు అంత సీన్ లేదని చెప్పా: గొడవపై ఇషాంత్ శర్మ

Posted by:
Published: Tuesday, November 17, 2015, 9:26 [IST]

బెంగళూరు: శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగిన ఇషాంత్ శర్మ ఒక టెస్టు మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ రోజున తన హెల్మెట్‌ను కొట్టమన్నట్లు దమ్మిక ప్రసాద్‌కు సైగ చేసిన దృశ్యం అందరికీ గుర్తుండి ఉంటుంది.

నాడు ఏం జరిగిందో ఇషాంత్ శర్మ చెప్పాడు. ఒక ఓవర్లో బౌలర్ రెండు బౌన్సర్లు వేయవచ్చునని, అయితే దమ్మిక నోబాల్ అవుతుందని తెలిసీ మూడోది వేశాడని, అంతకుముందు తన బౌలింగులో అతని చేతికి బంతి తగిలింది కాబట్టి అతను కావాలనే అలా చేస్తున్నాడని తనకు అర్థమైందని ఇషాంత్ చెప్పాడు.

Outburst in Sri Lanka thing of past: Ishant Sharma

అయితే ఆ బౌన్సర్ వల్ల తనకు ఏమీ ఇబ్బంది కలగలేదని, దాంతో తన హెల్మెట్‌కు తగిలేలా బంతి విసరడం నీ వల్ల కాదని, నీ బౌలింగులో అంత వేగం లేదని అన్నానని, అప్పుడే మిగతా ఆటగాళ్లు అందరూ చేరడంతో ఘటన పెద్దదైందని వివరించాడు. అయినా అది గతం అని చెప్పాడు. కాగా, తన బౌలింగ్ మెరుగుపడిందని చెప్పాడు.

English summary
Not the least bit concerned about the storm he kicked off due to an overtly aggressive demeanour during the Sri Lanka tour, Indian pacer Ishant Sharma says he does not even think about the outburst which led to a one-match ban on him.
మీ వ్యాఖ్య రాయండి