Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఎనిమిదేళ్ల తర్వాత ధోని తిరిగి ఆడుతున్నాడు!

Posted by:
Published: Wednesday, November 18, 2015, 10:35 [IST]

బెంగళూరు: భారత వన్డే, టీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా ఏళ్ల తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడనున్నాడు.ఎనిమిదేళ్ల విరామం తర్వాత అతను మళ్లీ దేశవాళీ క్రికెట్‌ ఆడటానికి సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు ధోనికి దేశవాళీ మ్యాచ్‌లు ఆడేంత ఖాళీ ఉండేది కాదు.

కానీ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాక అతడికి తీరిక దొరుకుతోంది. మూణ్నెల్లు మైదానానికి దూరంగా ఉండి, దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడిన ధోని, ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే నెల జార్ఖండ్‌ తరఫున విజయ్‌ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాలని అతను యోచిస్తున్నాడు.

After 8 years, Dhoni may play domestic cricket

డిసెంబరులో ప్రతిపాదిత పాకిస్థాన్‌ సిరీస్‌ జరగకుంటే తాను విజయ్‌ హజారె ట్రోఫీకి అందుబాటులో ఉంటానని ధోని చెప్పాడని, ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడు, జట్టుకు నాయకత్వం వహిస్తాడా అనే విషయాలు చర్చించలేదని, ధోని బరిలోకి దిగితే అతనే తమ జట్టు కెప్టెన్‌ అని జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి రాజేశ్‌ వర్మ చెప్పాడు.

English summary
India's limited overs captain Mahendra Singh Dhoni is all set to feature in domestic cricket after a gap of eight years as he is likely to play for Jharkhand in the Vijay Hazare Trophy next month in case the Pakistan series does not happen.
మీ వ్యాఖ్య రాయండి