Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

డ్రాగా ముగిసిన భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్ట్

Published: Wednesday, November 18, 2015, 13:34 [IST]

బెంగళూరు: భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య బెంగళూరు వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. గత 3 రోజులుగా స్టేడియం పరిసరాల్లో కురిసిన భారీ వర్షాలకు మైదానంలోని ఔట్‌ఫీల్డ్‌ అంతా బురదగా మారింది. మ్యాచ్‌ ప్రారంభమైన శనివారం మినహా ప్రతిరోజూ వర్షం కురిసింది. దీంతో 4రోజులుగా ఒక్క బంతి కూడా వేయకుండానే మ్యాచ్‌ రద్దయింది.

తాజాగా బుధవారం ఉదయం వర్షం లేకపోయినప్పటికీ స్టేడియానికి వచ్చిన అంపైర్లు ఔట్‌ ఫీల్డ్‌ను పరిశీలించారు. మైదానం మ్యాచ్‌ ఆడటానికి ఏమాత్రం అనుకూలంగా లేదని నిర్ధారించిన అంపైర్లు బెంగళూరు టెస్ట్‌ డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు.

Rain wins as 2nd India-South Africa Test ends in a draw in Bengaluru

శనివారం జరిగిన బెంగళూరు టెస్ట్‌లో బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టును తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 214 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులు చేసింది.

భారత్‌ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(45 నాటౌట్‌), మురళీ విజయ్‌ (28 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. దీంతో నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఆధిక్యంలో ఉంది. మూడో టెస్ట్‌ మ్యాచ్‌ నవంబర్ 25న నాగపూర్‌లో ప్రారంభంకానుంది.

English summary
Four days of washouts owing to persistent rain and wet ground conditions led to the second Test being officially called off here today, with hosts India leading the four-match series against South Africa 1-0.
మీ వ్యాఖ్య రాయండి